తెలంగాణ

telangana

ETV Bharat / bharat

చదువుకునేందుకు డబ్బులు లేకే చనిపోతున్నా.. - అమరావతిలో యువతి సూసైడ్​

పేదరికం ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. గొప్పగా చదువుకుని తల్లిదండ్రులకు మంచి పేరు తెచ్చిపెట్టాలనుకుంది ఆ యువతి. తాను కన్న కలలను పేదరికం వెలివేయగా.. ఉరి వేసుకొని విగతజీవిగా మారింది. తన ఇబ్బందులను ఓ కాగితంపై పెట్టి ఇదే చివరి లేఖ.. ఇక సెలవు అని చెప్పి అనంతలోకాలకు వెళ్లిపోయింది.

sejal gopal jadav
సేజల్​ గోపాల్​ జాదవ్​

By

Published : Oct 23, 2021, 1:23 PM IST

చదువుకునేందుకు డబ్బులేదని ఓ యువతి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన మహారాష్ట్రలోని అమరావతిలో జరిగింది. 'నా తల్లిదండ్రులకు నేను భారం కావాలనుకోవడం లేదు, అందుకే నా జీవితాన్ని ఇంతటితో ముగిస్తున్నా' అని సూసైడ్​ లెటర్​ రాసి చనిపోయింది.

సేజల్​
సేజల్​ గోపాల్​ జాదవ్​

ఇదీ జరిగింది..

మహారాష్ట్రలోని అమరావతి జిల్లాకు చెందిన సేజల్​ గోపాల్​ జాదవ్​ ఆత్మహత్య చేసుకుంది. చదువుకోవడానికి సరిపడా డబ్బులు లేవని తాను రాసిన సూసైడ్ లెటర్​లో పేర్కొంది. ఇంట్లో ఆర్థిక పరిస్థితి బాగోలేదు, ఇటువంటి సమయంలో నా చదువు కోసం వారికి భారం అవ్వాలని అనుకోవడం లేదని రాసుకొచ్చింది.

సేజల్​ రాసిన లేఖ
సేజల్​ రాసిన లేఖ

"మా నాన్న వ్యవసాయం చేస్తారు. మూడెకరాల పొలం ఉంది. అందులో సేద్యం చేయడం తప్ప.. మూడేళ్లుగా ఒక్కరూపాయి కూడా లాభం రావడం లేదు. దీంతో మా కుటుంబ పోషణ మరింత భారంగా మారింది. సరిగ్గా పూట గడవాలి అంటే చాలా కష్టంగా ఉంది. నాతో పాటు ఉండే ఇద్దరు అక్కలు, సోదరుడి పరిస్థితి కూడా మరింత దారుణంగా మారింది. ఈ దశలో నేను నా కుటుంబానికి భారంగా మారకూడదని అనుకుంటున్నాను. అందుకే ఈ నిర్ణయం తీసుకుంటున్నాను. "

-సేజల్ రాసిన లేఖ సారాంశం​

ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి:Hypersonic Weapons: హైపర్‌సోనిక్‌ జాబితాలో భారత్​

ABOUT THE AUTHOR

...view details