తెలంగాణ

telangana

ETV Bharat / bharat

టీచర్​తో స్టూడెంట్​ అఫైర్​.. అలా చేయమన్నందుకు రాడ్​తో కొట్టి! - టీచర్​తో స్టూడెంట్ ఎఫైర్​

Student affair with teacher: ఓ మైనర్​ విద్యార్థి ఉపాధ్యాయురాలిని హత్య చేశాడు. గర్భవతి అయిన టీచర్​ ఇంట్లో ఒంటరిగా ఉండగా రాడ్​తో కొట్టి చంపాడు. వీరిద్దరి మధ్య గల వివాహేతర సంబంధమే దీనికి కారణమని పోలీసులు తెలిపారు. ఈ ఘటన ఉత్తర్​ప్రదేశ్​లో జరిగింది.

Student affair with teacher
Student affair with teacher

By

Published : Jul 3, 2022, 9:29 PM IST

Student Affair with Teacher: ఉత్తర్​ప్రదేశ్​ అయోధ్యలో ఓ మైనర్​ విద్యార్థి.. ప్రభుత్వ ఉపాధ్యాయురాలిని హత్య చేశాడు. గర్భవతి అయిన టీచర్​.. ఇంట్లో ఒంటరిగా ఉండగా రాడ్​తో కొట్టి చంపాడు. హత్యకు వీరిద్దరి మధ్య గల వివాహేతర సంబంధమే కారణమని పోలీసులు తెలిపారు. ఈ సంబంధాన్ని కొనసాగించాలని టీచర్​ కోరగా.. దానికి విద్యార్థి అంగీకరించలేదని చెప్పారు. దీనిని దోపీడీగా పక్కదారి పట్టించేందుకు ఇంట్లో నుంచి విలువైన వస్తువులు దొంగిలించాడని పేర్కొన్నారు. నిందితుడిని అరెస్టు చేసి జువైనల్​ జస్టిస్​ బోర్డు ఎదుట హాజరుపరిచినట్లు పోలీసులు తెలిపారు.

గుడిలో హత్య.. గొడ్డలితో నరికి: ఉత్తర్​ప్రదేశ్​ అయోధ్య భువపుర్​ గ్రామంలోని హనుమాన్​ దేవాలయంలో ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడు. పంకజ్​ శుక్లా అనే వ్యక్తి గుడిలో నిద్రపోతుండగా అతడి బంధువు గుల్లు మిశ్రా గొడ్డలితో నరికి చంపాడు. కుటుంబ సభ్యులు ఉదయం లేచి చూసేసరికి పంకజ్​ శుక్లా రక్తపు మడుగులో కనిపించాడు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడు గుల్లు మిశ్రాను అరెస్టు చేశారు. హత్యకు ఉపయోగించిన గొడ్డలిని స్వాధీనం చేసుకున్నారు. రాత్రి వీరిద్దరి మధ్య జరిగిన వివాదమే కారణమని పోలీసులు చెప్పారు.

అమేథి జిల్లాకు చెందిన పంకజ్​ శుక్లా.. గత రెండు నెలలుగా భువపుర్​ గ్రామంలో ఉండే బంధువైన శ్యామ్​ నారాయణ్​ వద్ద ఉంటున్నాడు. ఈ క్రమంలోనే శనివారం రాత్రి భోజనం చేసిన అనంతరం హనుమాన్ దేవాలయం వద్ద నిద్రపోయాడు. కుటుంబ సభ్యులు ఉదయం లేచి చూసేసరికి గుడి వద్ద శవమై కనిపించాడు. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలికి చేరుకున్నారు. అనంతరం మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

అక్కాచెల్లెళ్లపై సామూహిక అత్యాచారం: ఉత్తర్​ప్రదేశ్​లోని మౌ ప్రాంతంలో దారుణం జరిగింది. ఇద్దరు మైనర్​ అక్కాచెల్లెళ్లపై సామూహిక అత్యాచారం చేశారు దుండగులు. ఈ కేసులో ఐదుగురు నిందితులను అరెస్టు చేసినట్లు పోలీసుల తెలిపారు. జూన్​ 30న ఇద్దరు బయటకు వెళ్లగా అత్యాచారం చేసినట్లు బాధితుల తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయం బయటకు చెపితే చంపేస్తామంటూ బెదిరించినట్లు తెలిపారు. నిందితులను విశాల్​(22), అరుణ్​(19), సుడిన్​(23), జితేశ్​(20), చంద్రకాంత్​గా ​(20) గుర్తించారు.

ఇదీ చదవండి:గోద్రా అల్లర్ల కేసు దోషికి జీవిత ఖైదు

ABOUT THE AUTHOR

...view details