తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'జమ్ముకశ్మీర్​లో జైలుకు 168మంది రోహింగ్యాలు' - rohingyas sent to jail

జమ్ముకశ్మీర్​లో అక్రమంగా నివసిస్తున్న 168 మంది రోహింగ్యాలను జైలుకు తరలించినట్లు అధికారులు తెలిపారు. రోహింగ్యాల బయోమెట్రిక్​, ఇతర ధ్రువపత్రాల పరిశీలన కార్యక్రమం నిర్వహిస్తోన్న జమ్ముకశ్మీర్ అధికార యంత్రాంగం.. ఈ వివరాలను వెల్లడించింది.

168 Rohingyas living illegally in Jammu sent to jail: Officials
'అక్రమంగా నివసిస్తున్న 168 మంది రోహింగ్యాలు జైలుకు'

By

Published : Mar 7, 2021, 2:15 PM IST

జమ్ముకశ్మీర్​లో అక్రమంగా నివసిస్తున్న 168 మంది రోహింగ్యాలను హీరానగర్ జైలుకు తరలించినట్లు అధికారులు తెలిపారు. కేంద్ర పాలిత ప్రాంతంలో ఎలాంటి ధ్రువపత్రాలు లేకుండా నివసిస్తున్న విదేశీయుల వివరాలు సేకరిస్తున్న క్రమంలో వీరు బయటపడ్డారని పేర్కొన్నారు.

జమ్ము, సాంబా జిల్లాల్లో నివసిస్తున్న రోహింగ్యాల బయోమెట్రిక్​, ఇతర ధ్రువపత్రాల పరిశీలన కార్యక్రమం.. ఎంఏఎం స్టేడియంలో కట్టుదిట్టమైన భద్రతల మధ్య నిర్వహిస్తోంది జమ్ముకశ్మీర్ అధికార యంత్రాంగం.

కశ్మీర్​లో అక్రమంగా నివసిస్తున్న రోహింగ్యాలను, బంగ్లాదేశీ అక్రమ వలసదారుల వల్ల శాంతి భద్రతలకు విఘాతం కలుగుతోందని.. తక్షణమే వారిని స్వస్థలాలకు పంపించేందుకు చర్యలు తీసుకోవాలంటూ జమ్ములోని అనేక రాజకీయ పార్టీలు, సామాజిక సంస్థలు.. ఇప్పటికే చాలాసార్లు కేంద్రాన్ని కోరాయి.

ప్రభుత్వ లెక్కల ప్రకారం.. జమ్ము, సాంబా జిల్లాల్లో 13,700 మందికి పైగా రోహింగ్యా ముస్లింలు, బంగ్లాదేశీ వలసదారులు నివసిస్తున్నారు. 2008-16 మధ్యలో 6వేల మంది కొత్తగా వచ్చి స్థిరపడ్డారు.

ఇదీ చదవండి :జేఎన్​ఎంసీ రికార్డ్​- 300మందికి ఓపెన్​ హార్ట్​ సర్జరీ

ABOUT THE AUTHOR

...view details