అమ్మమ్మ వయసు ఉన్న 58 ఏళ్ల మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ 16 ఏళ్ల బాలుడు. అనంతరం ఆమెను తీవ్రంగా కొట్టి హత్య చేశాడు. మధ్యప్రదేశ్‌లోని రీవా జిల్లాలో ఈ ఘోరం జరిగింది. రెండేళ్ల క్రితం బాధితురాలు తన ఇంట్లో మొబైల్ ఫోన్ దొంగిలించాడనే నేరం మోపినందుకే నిందితుడు పగతో ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని పోలీసులు తెపిపారు.
పోలీసుల వివరాల ప్రకారం..
కైలాశ్పురి గ్రామం హనుమాన పోలీస్ స్టేషన్ పరిధిలో జనవరి 30న అర్ధరాత్రి జరిగింది. రెండేళ్ల క్రితం బాధితురాలు నివాసం ఉంటున్న వీధిలోనే నిందితుడు ఉండేవాడు. వారి ఇంటికి టీవీ చూడటానికి బాలుడు తరచుగా వెళ్లేవాడు. ఈ క్రమంలో నిందితుడు తమ ఇంట్లోని ఫోన్ను దొంగలించి బాధితురాలి కుటుంబం ఆరోపించింది. దొంగతనం ఆరోపణతో గ్రామంలో తన పరువు పోయిందని భావించిన బాలుడు ఆ కుటుంబంపై పగ పెంచుకున్నాడు. ఎలాగైనా ఆ కుటుంబంపై ప్రతీకారం తీర్చుకోవాలని భావించాడు.
అదును కోసం వేచి చూసిన నిందితుడి బాధితురాలి ఇంట్లో ఆమె భర్త, కుమారుడు లేని సమయంలో ఆమెపై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు. దీంతో ఆ మహిళ ప్రతిఘటిస్తూ కేకలు వేసింది. అప్పడు ఆమె నోట్లో ఓ వస్త్రాన్ని ఉంచి ప్లాస్టిక్ కవర్, తాడు సాయంతో ఆ మహిల ముఖాన్ని కట్టేసి పక్కనే నిర్మాణంలో ఉన్న ఓ భవనంలోకి ఈడ్చుకుంటూ వెళ్లాడు. అనంతరం ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అంతటితో ఆగకుండా కొడవలితో మహిళ తల, ఇతర శరీర అవయవాలపై దాడి చేశాడు. కర్రతో ఆమె ప్రైవేటు భాగాలనూ గాయపరిచాడు. అనంతరం మహిళ ఇంట్లో ఉన్న రూ.1000 నగదులో పాటు నగలను అపహరించాడు. బాధితురాలి కుటుంబ సభ్యులు ఫిబ్రవరి 1న పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. పోలీసుల ఎదుట నిందితుడు నేరాన్ని అంగీకరించాడు. దీంతో అతడిపై ఐపీసీలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి జువైనల్ హోంకు తరలించామని పోలీసులు తెలిపారు.