తెలంగాణ

telangana

ETV Bharat / bharat

బాంబు తయారు చేసిన పదహారేళ్ల బాలుడు అరెస్టు

తమిళనాడులో నాటు బాంబు తయారు చేస్తున్న కారణంగా ఓ 16 సంవత్సరాల బాలుడిని పోలీసులు అరెస్టు చేశారు. బిహార్​ వ్యక్తి నుంచి ఆ బాలుడు బాంబు తయారు చేయడం నేర్చుకున్నాడు.

By

Published : May 18, 2021, 9:14 PM IST

bomb
బాంబు

బాంబు తయారు చేశాడన్న కారణంతో 16 ఏళ్ల బాలున్ని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన తమిళనాడులోని తంజావూర్​ జిల్లా కుంభకోణంలో జరిగింది.

బిహార్​ నుంచి వచ్చిన ఓ యువకుడి నుంచి ఈ బాలుడు నాటు బాంబు తయారు చేయడం నేర్చుకున్నాడు. ఇద్దరు కలిసి బాంబు తయారు చేస్తుండగా బాలుడి స్నేహితుడు దానిని చిత్రీకరించాడు. అనంతరం ఈ వీడియో అంతర్జాలంలో పోస్టు చేశాడు.

ఈ కేసులో ఆ బాలున్ని, వీడియో తీసిన అతని స్నేహితున్ని పోలీసులు అరెస్టు చేశారు. కుంభకోణంలోని ఓ రోడ్డుకు సమీపంలో బాంబును గుర్తించారు పోలీసులు.

ప్రధాన నిందితుడైన బాలుడిని.. తంజావూరులోని పరివర్తన గృహానికి తరలించారు.

ఇదీ చదవండి:లద్దాఖ్​ సమీపంలో మళ్లీ చైనా సైన్యం కదలికలు

ABOUT THE AUTHOR

...view details