తెలంగాణ

telangana

ETV Bharat / bharat

గార్డ్స్​ కళ్లలో కారం చల్లి 16 మంది ఖైదీలు పరార్​

జైలు సిబ్బంది కళ్లలో కారం చల్లి 16 మంది ఖైదీలు తప్పించుకొనిపోయారు. ఈ సంఘటన రాజస్థాన్​ ఫలోడి సబ్​-జైలులో జరిగింది. వారిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపినట్లు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు.

prisoners flee from Jodhpur sub-jail
జైలు నుంచి ఖైదీల పరార్​

By

Published : Apr 6, 2021, 5:48 AM IST

Updated : Apr 6, 2021, 7:09 AM IST

రాజస్థాన్​ జోధ్​పుర్​లోని ఫలోడి సబ్​-జైల్​ నుంచి 16 మంది ఖైదీలు తప్పించుకున్నారు. జైలులో విధులు నిర్వర్తిస్తున్న భద్రతా సిబ్బంది కళ్లలో కారంపొడి చల్లి పరారైనట్లు అధికారులు తెలిపారు. తప్పించుకుని పారిపోయిన వారిలో ప్రధానంగా హత్య, మాదకద్రవ్యాల అక్రమ రవాణా కేసుల్లో శిక్ష అనుభవిస్తున్నవారే ఉన్నట్లు వెల్లడించారు.

పరారైన ఖైదీలను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగినట్లు వెల్లడించారు పోలీసు ఉన్నతాధికారులు.

" రాత్రి 8.30 గంటల సమయంలో భోజనం ముగిశాక వారి వారి గదుల్లోకి తీసుకెళ్లే క్రమంలో సిబ్బంది కళ్లలో కారం చల్లి పారిపోయారు. వారిని పట్టుకునేందుకు పలు పోలీసు బృందాలను రంగంలోకి దింపాం. ఈ ప్రాంతంలోని అన్ని మార్గాలను మూసివేశాం. "

- అనిల్​ కయాల్​, జోధ్​పుర్​ రూరల్​ ఎస్పీ

ఇదీ చూడండి:'400మంది నక్సల్స్​.. బుల్లెట్ల వర్షం కురిపించారు '

Last Updated : Apr 6, 2021, 7:09 AM IST

ABOUT THE AUTHOR

...view details