ఉత్తర్‌ప్రదేశ్ కాన్పుర్‌లో జికా వైరస్(Zika virus in Kanpur) విజృంభణ కొనసాగుతోంది. కొత్తగా మరో 16 మంది.. వైరస్ బారినపడ్డారు. దీంతో మొత్తం జికా వైరస్(Zika virus in India) బాధితుల సంఖ్య 105కి చేరింది. రోజురోజుకు వైరస్ వ్యాప్తి అధికమవుతుండడం వల్ల జికా కట్టడికి యూపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
యూపీలో జికా విజృంభణ.. 100 దాటిన కేసులు - యూపీలో జికా వైరస్
ఉత్తర్‌ప్రదేశ్ కాన్పుర్‌లో జికా వైరస్(Zika Virus In Kanpur) వ్యాప్తి కలకలం సృష్టిస్తోంది. కొత్తగా 16 మందికి వైరస్ సోకినట్లు తేలింది. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 105కి చేరింది.
యూపీలో జికా విజృంభణ
ప్రస్తుతం పరిస్థితిని సమీక్షించేందుకు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కాన్పూర్‌లో బుధవారం పర్యటించనున్నారు. దీనిలో భాగంగా జిల్లా అధికార యంత్రాగంతో సమావేశం నిర్వహిస్తారు. ఇందులో వైరస్ సంక్రమణను నివారించడానికి మార్గదర్శకాలను కూడా జారీ చేయనున్నారు. ఇప్పటికే వైరస్‌పై ఎన్నోఅవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది పురపాలక శాఖ.