తెలంగాణ

telangana

ETV Bharat / bharat

16మంది నక్సలైట్ల లొంగుబాటు

ఛత్తీస్​గఢ్​లోని దంతెవాడ జిల్లాలో 16 మంది నక్సల్స్​ లొంగిపోయినట్లు పోలీసులు వెల్లడించారు. ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహకాలు నచ్చి లొంగిపోయినట్లు నక్సల్స్​ తెలిపారని పేర్కొన్నారు.

16 Naxals surrender in Chhattisgarh's Dantewada district
16మంది నక్సలైట్ల లొంగుబాటు

By

Published : Jan 30, 2021, 10:44 PM IST

ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడ జిల్లాలో శనివారం 16 మంది నక్సలైట్లు లొంగిపోయినట్లు అధికారులు వెల్లడించారు. వీరిలో ఇద్దరిపై లక్ష చొప్పున రివార్డులు ఉన్నట్లు వారు తెలిపారు. నక్సలైట్లను జనజీవన స్రవంతిలోకి తీసుకొచ్చేందుకు ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వం 'లోన్‌ వర్రాటు' అనే పునరావాస కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇందులో భాగంగా శనివారం 16 మంది నక్సలైట్లు లొంగిపోయినట్లు దంతెవాడ ఎస్పీ అభిషేక్‌ పల్లవ తెలిపారు. వారు ఆచరించే 'హాలో' భావజాలంపై అసంతృప్తిగా ఉన్నట్లు వారు వెల్లడించారన్నారు. గతేడాది ప్రారంభించిన ఈ కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకూ 288 నక్సలైట్లు జనజీవన స్రవంతిలోకి వచ్చారని ఆయన తెలిపారు.

తక్షణ సాయంగా రూ.10,000

లొంగిపోయిన నక్సలైట్లకు తక్షణ సాయంగా రూ. పదివేల రూపాయలు అందించామని ఎస్పీ తెలిపారు. వారికి ప్రభుత్వ పరంగా అందాల్సిన అన్ని అదనపు సౌకర్యాలను కల్పిస్తామన్నారు. ఈ పునరావాస కార్యక్రమంలో భాగంగా వారికి నైపుణ్య శిక్షణ అందిస్తామని ఆయన వెల్లడించారు. లోన్‌ వర్రాటు కార్యక్రమాన్ని ప్రచారం చేసేందుకు నక్సలైట్లకు చెందిన అన్ని గ్రామాల్లో పోస్టర్లు, బ్యానర్లు ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు.

ఇదీ చూడండి:షా సమక్షంలో భాజపాలో చేరిన రాజీవ్​ బెనర్జీ

ABOUT THE AUTHOR

...view details