అసోంలోని నాగావ్ జిల్లాలో 16 అడుగులు పొడవైన కింగ్ కోబ్రాను రక్షించారు పాముల సంరక్షుడు.
జిల్లాలోని టీ తోటల్లో ఈ భారీ సర్పం కనిపించింది. భయాందోళనకు గురైన స్థానికులు పాముల సంరక్షకునికి సమాచారం అందించారు. అతడు ఆ పామును చాకచక్యంగా పట్టుకుని అడవిలో విడిచిపెట్టారు.