తెలంగాణ

telangana

ETV Bharat / bharat

16నెలల చిన్నారికి రూ.16 కోట్ల ఇంజెక్షన్​.. సోనూసూద్​ భారీ సాయం - సోనూసూద్ సాయం

అత్యంత అరుదైన వ్యాధితో బాధపడుతున్న 16 నెలల బాలుడికి తనవంతు సాయం చేసేందుకు ముందుకొచ్చారు నటుడు సోనూసూద్. చిన్నారి ప్రాణాలు నిలవాలంటే రూ.16కోట్లు ఇంజెక్షన్ ఇవ్వాల్సి ఉండగా.. విరాళాలు సేకరించేందుకు ప్రచారం చేస్తున్నారు.

sonu-sood-offer-big-help
సోనూసూద్

By

Published : Apr 26, 2022, 10:02 AM IST

Updated : Apr 26, 2022, 10:13 AM IST

Sonu Sood Help: మహారాష్ట్ర నాగ్​పుర్​కు చెందిన 16నెలల చిన్నారి స్పైనల్​ మస్కులర్​ ఆత్రోపి అనే అరుదైన వ్యాధితో బాధపడున్నాడు. అతను బతకాలంటే రెండు నెలల్లోపు రూ.16కోట్ల ఖరీదైన ఇంజెక్షన్ ఇవ్వాలి. బాలుడి తల్లిదండ్రులు డా.విక్రాంత్​, మీనాక్షి అకుల్వార్​కు ఆ స్తోమత లేదు. తమ బిడ్డ పరిస్థితి చూసి తల్లడిల్లిపోతున్నారు. ఎలాగైనా బతికించుకోవాలని తాపత్రయపడుతున్నారు. ఇంజెక్షన్​ కోసం రూ.16కోట్లు సమీకరించాలంటే సాధారణ వ్యక్తులకు అసాధ్యమే. అందుకే విరాళాలు సేకరించి తమ బిడ్డ ప్రాణాలు నిలుపుకోవాలని విక్రాంత్, మీనాక్షి స్నేహితుల సాయంతో ప్రచారం మొదలుపెట్టారు. సామాజిక మాధ్యమాల్లో దీనికి మంచి స్పందన లభించింది. సోనూసూద్​, అభిశేక్ బచ్చన్, మనోజ్​ బాజ్​పాయ్​ వంటి ప్రముఖ నటులు ఈ ప్రచారం చూసి తమ వంతు సాయం చేసేందుకు ముందుకొచ్చారు.

అభిశేక్​ బచ్చన్ సాయం
సోనూసూద్

Rs 16 Cr injection: అయితే చిన్నారికి సాయం అందించేందుకు సోనూసూద్​ ఎక్కువ చొరవతీసుకున్నారు. ఇప్పటివరకు అందిన రూ.4కోట్ల విరాళాల్లో ఆయనదే సింహభాగం. అంతేకాదు విహాన్ చికిత్స పొందుతున్న ఆస్పత్రికి కూడా వెళ్లారు. చిన్నారి తల్లిదండ్రులకు తెలియకుండా అక్కడకు వెళ్లడం వల్ల.. వారు కూడా షాక్​తో పాటు ఆనందానికి గురయ్యారు. అంతేకాదు సోనూసూద్ మీడియాను పిలిచి సమావేశం నిర్వహించారు. విహాన్​కు సాయం చేసేందుకు ముందుకురావాలని అందరినీ కోరారు.

Sonusood News: విహాన్​కు ఇంజెక్షన్ కావాలంటే ఇంకా నెలరోజుల్లో రూ.12కోట్లు సమకూర్చాలి. ఇంజెక్షన్ ఆలస్యంగా ఇస్తే ప్రభావశీలత తగ్గుతుందని అతని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దాతలు పెద్దమనసుతో ముందుకువచ్చి తమబిడ్డ ప్రాణాలు నిలపాలని ప్రాధేయపడుతున్నారు. ఇంతపెద్ద మొత్తం సేకరించడం కష్టమే అయినప్పటికీ అసాధ్యం మాత్రం కాదు. సామాజిక మాధ్యమాల్లో కూడా వీరికి మద్దతుగా పెద్దఎత్తున ప్రచారం జరుగుతోంది.

బాలుడి కోసం సెలబ్రిటీలు

ఇదీ చదవండి:గుర్రం 'రంగు' చూసి ఫిదా.. రూ.23లక్షలకు కొనుగోలు.. స్నానం చేయించాక షాక్!

Last Updated : Apr 26, 2022, 10:13 AM IST

ABOUT THE AUTHOR

...view details