తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మూడు కేటగిరీల వారిగా డేటా చోరీపై లోతుగా ఆరా

DataTheft Of 16 Crore Indians In Hyderabad: 16.8 కోట్ల మంది భారతీయుల డేటా చోరీ కేసులో నేడు నిందితులను సిట్​ అధికారులు ప్రశ్నించనున్నారు. జాతీయ భద్రతలో ముడిపడిన అంశం కావడంతో దర్యాప్తును వేగవంతం చేశారు. డేటా లీకేజీ ఎక్కడ నుంచి బయటపడిందో తెలుసుకునేందుకు అన్ని కోణాల్లోనూ విచారణ చేపట్టారు.

data theft case
data theft case

By

Published : Mar 28, 2023, 11:44 AM IST

DataTheft Of 16 Crore Indians In Hyderabad: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 16.8 కోట్ల భారతీయుల డేటా చోరీ కేసులో సైబరాబాద్ పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఐదుగురు నిందితులను సిట్​ అధికారులు ప్రశ్నించనున్నారు. కోట్ల మంది డేటా లీకవ్వడంతో.. ప్రస్తుతం స్వాధీనం చేసుకున్న డేటాను ఐటీ చట్టం ప్రకారం మూడు విభాగాలుగా సిట్​ అధికారులు విభజించారు. ప్రజలకు సంబంధించిన సమాచారాన్ని పీఐఐ (పర్సనల్ ఐడెంటిఫైయింగ్ ఇన్ఫర్మేషన్), రక్షణ శాఖ, ఇతర ప్రభుత్వ రంగ సంస్థ ఉద్యోగుల కీలక సమాచారాన్ని ఎస్పీడీఐ(సెన్సిటివ్ పర్సనల్ డేటా ఇన్ఫర్మేషన్)లుగా విభజించి సమాచారాన్ని సేకరిస్తున్నారు.

అనంతరం ఐటీ చట్టం ప్రకారం ముందుకెళ్తామని సిట్​ అధికారులు తెలిపారు. ఈ వ్యవహారంలో దేశ రాజధాని పరిధిలో పనిచేసే రక్షణ శాఖ ఉద్యోగుల డేటా ఎందుకోసం కొన్నారనే అంశం అత్యంత చర్చనీయాంశంగా మారింది. ఇలా ఎందుకు కొన్నారనే ప్రశ్న సిట్​ అధికారులను తికమక పెడుతుంది. అసలు ఎక్కడి నుంచి కొట్టేశారనే అంశం ఆందోళన కలిగిస్తోంది. ఇటీవల దిల్లీ, హైదరాబాద్​కు చెందిన పలువురు ఆర్మీ అధికారులతోనూ, సైబరాబాద్ అధికారులతోనూ సిట్​ బృందం మాట్లాడింది.

DataTheft Case UPDATE: అదనపు సమాచారం కోసం రక్షణ శాఖకు చెందిన మరి కొందరు అధికారులతో.. మరోసారి సంప్రదింపులు జరిపినట్లు సమాచారం. ప్రస్తుతం లభించిన డేటా ఆధారంగా చూస్తే.. రక్షణ శాఖ అధికారులు అంతర్గతంగా విచారిస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలినట్లు ఉన్నత వర్గాల సమాచారం. హ్యాక్​ చేశారా.. లేదా.. ఉద్యోగుల ద్వారా ఇదంతా లీకైందా అనే కోణంలో పరిశీలిస్తున్నట్లు సిట్​ అధికారులు తెలిపారు. ఇప్పటికే ఐదుగురు నిందితులను పోలీసు అరెస్ట్​ చేసి.. విచారించారు. మళ్లీ నేటి నుంచి కస్టడీలో సిట్​ అధికారులు ప్రశ్నించనున్నారు.

కుమార్, నీతీశ్ భూషణ్, సుశీల్ తోమర్, అతుల్ ప్రతాప్ సింగ్, సందీప్ పాల్​ను మాత్రమే కస్టడీకి తీసుకుంటున్నట్లు అధికారులు చెప్పారు. నేటి నుంచి శనివారం వరకూ కస్టడీ కొనసాగుతుంది. ఈసారి నిందితులు ఇచ్చే సమాచారం కీలకం కానుంది. ఎందుకంటే మరిన్ని కొత్త విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. డేటా కొన్న వ్యక్తుల సమాచారం తెలిస్తే.. ఎందుకోసం వినియోగించారనే వ్యవహారం వెలుగులోకి వస్తుందని భద్రతా వర్గాలు భావిస్తున్నాయి. సిట్​ విచారణ అనంతరం మరికొంత మందిని అరెస్ట్​ చేయవచ్చు అని ఉన్నత వర్గాలు తెలుపుతున్నాయి. క్రెడిట్‌, రుణ సంస్థల నుంచి 16.8 కోట్ల మంది డేటాను చోరీ చేశారని ఈ ముఠాను పోలీసులు అరెస్ట్​ చేశారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details