తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మంచులో 150 మంది పర్యటకులు.. 12 గంటలు నరకం! - హిమాచల్​ప్రదేశ్​ వార్తలు

Tourists rescued in Himachal Pradesh: భారీగా కురిసిన మంచు కారణంగా.. 150మంది పర్యటకులు హిమాచల్​ప్రదేశ్​లోని పరాషార్​ ప్రాంతంలో చిక్కుకుపోయారు. 12గంటల పాటు సహాయక చర్యలు చేపట్టిన అధికారులు.. చివరకు వారిని సురక్షిత ప్రాంతానికి తరలించారు.

Tourists rescued in Himachal Pradesh
మంచులో చిక్కుకున్న 150మంది పర్యటకులు.. చివరికి!

By

Published : Dec 27, 2021, 12:51 PM IST

Tourists rescued in Himachal Pradesh: హిమాచల్​ప్రదేశ్​ మండీలో భారీ హిమపాతం కారణంగా చిక్కుకుపోయిన పర్యటకులను అధికారులు రక్షించారు. పరాషార్​ ప్రాంతంలో.. స్థానికుల సహాయంతో ఆపరేషన్​ చేపట్టి.. మొత్తం 150మందిని సురక్షిత ప్రాంతానికి చేర్చారు.

మంచులో చిక్కుకున్న వాహనాలు
పరాషార్​ ప్రాంతంలో..

ఆదివారం.. పరాషార్​ ప్రాంతంలో మంచు ఎక్కువగా కురిసింది. వాతావరణం సహకరించకపోయినా.. పర్యటకులు అక్కడికి వెళ్లారు. సాయంత్రం నాటికి వాతావరణం మరింత ప్రతికూలంగా మారింది. రోడ్లపై మంచు పేరుకుపోయింది. దీంతో 40 వాహనాల్లో వెళ్లిన 150మంది పర్యటకులు అక్కడ చిక్కుకుపోయారు. వారిలో పిల్లలు కూడా చాలా మంది ఉన్నారు.

జేసీబీ సహాయంతో మంచును తొలగిస్తూ..
పర్యటకులు

12గంటల పాటు సహాయక చర్యలు చేపట్టినట్టు, స్థానికుల సహాయంతోనే పర్యటకులను రక్షించగలిగినట్టు మండీ ఎస్​పీ షాలిని అగ్నిహోత్రి తెలిపారు. శీతాకాలంలో అలాంటి ప్రాంతాలకు వెళ్లవద్దని ప్రజలకు ఎస్​పీ సూచించారు.

ఇదీ చూడండి:-బద్రినాథ్​ ఆలయాన్ని కప్పేసిన మంచు దుప్పటి

ABOUT THE AUTHOR

...view details