తెలంగాణ

telangana

ETV Bharat / bharat

గంతలు కట్టుకుని పజిల్ పూర్తి- లిమ్కా బుక్​లో చోటు - rubik's cube record

ముంబయికి చెందిన 15 ఏళ్ల అఫాన్​.. కళ్లకు గంతలు కట్టుకుని ర్యూబిక్స్ క్యూబ్​ పజిల్ పూర్తి చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. క్షణాల్లోనే 'ఈటీవీ భారత్​' పేరును ర్యూబిక్స్ క్యూబ్​తో రాసి ఔరా అనిపించాడు. ఇప్పటికే లిమ్కా బుక్​ ఆఫ్​ రికార్డ్స్​లో చోటు సంపాదించిన అఫాన్​.. గిన్నిస్ రికార్డే లక్ష్యంగా శ్రమిస్తున్నాడు.

15 years old Affan name in Lamka Book of Records
కళ్లకు గంతలు కట్టుకుని క్షణాల్లో పజిల్

By

Published : Jun 2, 2021, 3:19 PM IST

కళ్లకు గంతలు కట్టుకుని క్షణాల్లో పజిల్ పూర్తి

ఎవరికైనా కళ్లకు గంతలు కడితే చీకటి కనిపిస్తుంది. కానీ ముంబయిలోని ముంబ్రాకు చెందిన 15ఏళ్ల అఫాన్​ కళ్లకు గంతలు కడితే.. అతని అసాధారణ ప్రతిభ బయటపడుతుంది. అవును.. కళ్లు మూసుకొని సెకన్స్​లో ర్యూబిక్స్ క్యూబ్​ పజిల్​ను పూర్తి చేయటంలో అతను దిట్ట. క్షణాల్లోనే 'ఈటీవీ భారత్​' పేరును రూబిక్​ క్యూబ్​తో రాసి ఔరా అనిపించాడు. 15 ఏళ్లకే లిమ్కా బుక్​ ఆఫ్ రికార్డ్స్​లో పేరు నమోదు చేసుకున్నాడు. గిన్నిస్ రికార్డు లక్ష్యంగా దూసుకెళ్తున్నాడు.

ఆటలోనే కాదు మాటలోనూ..

కళ్లకు గంతలు కట్టుకుని క్విజ్​

అఫాన్​.. కేవలం ర్యూబిక్స్ క్యూబ్​ పజిల్​లోనే కాదు. ఇంగ్లీష్, ఉర్దూ, హిందీ భాషల్లోనూ నైపుణ్యం ఉంది. ప్రస్తుతం అతను ఓ విజయవంతమైన వక్తగా కొనసాగుతున్నాడు. ఇప్పటికే చాలా కార్యక్రమాల్లో ప్రసంగించాడు.

ఫోన్ వదిలి ప్రాక్టీస్​..

క్షణాల్లో ఈటీవీ భారత్​ పేరు రాసిన అఫాన్

గతంలో తాను మొబైల్​ ఫోన్​కు అలవాటు పడ్డానని.. తన తండ్రి ఇచ్చిన స్ఫూర్తితో సెల్​ఫోన్​ వదిలి ఈ ఆటను ప్రాక్టీస్​ చేయటం ప్రారంభించానని చెప్పుకొచ్చాడు అఫాన్​.

ఇదీ చదవండి :ప్రజలు రోడ్లపై నడుస్తూ చనిపోతారు- స్వామీజీ జోస్యం!

ABOUT THE AUTHOR

...view details