కేరళలో దారుణం జరగింది. బాయ్‌ఫ్రెండ్ చేతి మణికట్టును కట్ చేసింది ఓ ప్రబుద్ధురాలు. ఆపై అత్మహత్యాయత్నం చేసుకుంది. దీంతో ఇద్దరినీ ఆస్పత్రికి తరలించారు స్థానికులు. ఈ ఘటన కోజికోడ్ జిల్లాలో జరిగింది.
పోలీసులు వివరాల ప్రకారం.. కొడంచెరీకి చెందిన ఒక యువతి ఓ యువకుడితో రిలేషన్షిప్లో ఉంది. ఈ విషయం ఇంట్లో తెలియగా.. వాళ్లు ఒప్పుకోలేదు. దీంతో ఇద్దరూ కలిసి చనిపోవాలని నిర్ణయించుకున్నారు. తామరస్సెరీ బస్టాండ్ వద్ద బస్ కోసం ఎదురుచూస్తున్నారు. ఇంతలో అకస్మాత్తుగా యువతి రేజర్ బ్లేడ్ తీసి తన బాయ్‌ఫ్రెండ్ చేతి మణికట్టును కట్ చేసింది. ఆపై తాను కూడా ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించింది. దీంతో స్థానికులు ఇద్దరినీ కాపాడి.. తామరస్సే తాలూక ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఇద్దరి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం.
విద్యార్థిపై గ్యాంగ్ రేప్..
ఓ పదో తరగతి బాలికను గ్యాంగ్ రేప్ చేశారు కొందరు దుండగులు. హోటల్‌కు తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డారు. నిందితుల్లోని ఇద్దరిని పోలీసులు శనివారం అరెస్టు చేశారు. ఈ ఘటన హరియాణాలోని గురుగ్రామ్‌లో జరిగింది.
పోలీసుల కథనం ప్రకారం..శనివారం మధ్యాహ్నం 12.30 గంటలకు పదో తరగతి చదువుతున్న 14 ఏళ్ల బాలిక ఇంటినుంచి బయటకు వెళ్లింది. అయితే దగ్గరున్న పార్కులో వాకింగ్‌కు వెళ్లినట్టు భావించింది బాలిక తల్లి. ఎంతసేపటికీ ఆమె ఇంటికి తిరిగి రాకపోగా కుటుంబ సభ్యులంతా చుట్టుపక్కల ప్రదేశాల్లో గాలించారు. ఎంత వెతికినా బాలిక ఆచూకీ తెలియలేదు. అయితే ఆదివారం ఉదయం 10 గంటలకు ఇంటి సమీపంలో బాలిక కనిపించింది.
దీంతో రాత్రంగా ఎక్కడికి వెళ్లావని ఆరాతీశారు కుటుంబ సభ్యులు. రాత్రి తన స్నేహితులిద్దరు వచ్చి.. ఓ హోటల్‌కు తీసుకెళ్లారని చెప్పింది. ఆ ఇద్దరితో పాటు మరో ముగ్గురు తనపై అత్యాచారానికి పాల్పడినట్లు బాలిక తెలిపింది. జరిగిన దాని గురించి ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించారని చెప్పింది. ఈ మేరకు పోలీసులకు చేసిన ఫిర్యాదులో బాలిక తల్లి పేర్కొంది.
పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. వైద్య పరీక్షల నిమిత్తం బాలికను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బాలికపై అత్యాచారం జరిగినట్టు వైద్యులు ధ్రువీకరించారు. సోమవారం సాయంత్రం ఇద్దరు నిందితులను అరెస్టు చేసి విచారిస్తున్నామని వెస్ట్ జోన్ డీసీపీ దీపక్ శర్మ తెలిపారు. మిగతా ముగ్గురు నిందితుల కోసం గాలిస్తున్నామని చెప్పారు.
మాంత్రికుడి మాటతో అత్యాచారం..
ఓ 8 ఏళ్లు బాలికపై 37 ఏళ్ల వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక జననాంగాల నుంచి రక్తం వస్తే.. తన పెళ్లికి ఉన్న అడ్డంకులు తొలగిపోతాయన్న మూఢ నమ్మకంతో ఈ దారుణానికి ఒడిగట్టాడు. బంగాల్లోని బాంకుడా జిల్లాలో ఈ ఘటన జరిగింది.