తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పోలీస్​ కానిస్టేబుళ్లుగా 15 మంది ట్రాన్స్​జెండర్లు - ఛత్తీస్​గఢ్​ పోలీసు కానిస్టేబుల్​ ఉద్యోగాలకు ట్రాన్స్​జెండర్ల ఎంపిక

ఛత్తీస్​గఢ్​లో ట్రాన్స్​జెండర్లు సైతం పోలీసు యూనిఫామ్​ ధరించనున్నారు. ఆ రాష్ట్ర పోలీసు కానిస్టేబుల్​ ఉద్యోగాలకు 15 మంది ట్రాన్స్​జెండర్లు ఎంపికయ్యారు. ఈ విజయం తమకెంతో గర్వకారణమని ట్రాన్స్​జెండర్ల సంక్షేమ బృందం మిట్వా తెలిపింది.

15 transgenders from Chhattisgarh set to wear police uniform
ఛత్తీస్​గఢ్​ రాష్ట్ర పోలీసు ఉద్యోగాలలో ట్రాన్స్​జెండర్లు

By

Published : Mar 2, 2021, 11:40 AM IST

ఛత్తీస్​గఢ్​లో 15 మంది ట్రాన్స్​జెండర్లు పోలీసు కానిస్టేబుల్​ ఉద్యోగాలకు ఎంపికయ్యారు. నియామక పరీక్షల ఫలితాన్ని ఆ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం విడుదల చేసింది.

ట్రాన్స్​జెండర్లు సైతం అందరిలాగే సమానులని అర్హలైనవారు నిరూపించారని ట్రాన్స్​జెండర్ల సంక్షేమ బృందం మిట్వా తెలిపింది. ఇది తమకెంతో గర్వకారణమని పేర్కొంది.

పోలీసు పోలీసు ఉద్యోగాలకు ఎంపికైన ట్రాన్స్​జెండర్లు

ఈ ఎంపిక మా అందరిలో ధైర్యాన్ని నింపింది. ఎంతో గౌరవాన్ని తీసుకువచ్చింది. శారీరక భేదాలు చూడకుండా ఉద్యోగాలకు ఎంపిక చేసినందుకు సెలెక్షన్​ అధికారులకు ధన్యవాదాలు.

- విద్యా రాజ్​పుత్​, మిట్వా బృందం సభ్యురాలు

పోలీసు యూనిఫాన్​ ధరిస్తానని నేను కలలో కూడా అనుకోలేదు. భద్రతా దళాలలో నాలాంటి వారిని చేర్పించడానికి కృషి చేస్తాను.

-ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థి

ఇదీ చదవండి:హాథ్రస్​లో రైతు హత్య- వేధింపుల కేసే కారణం!

ABOUT THE AUTHOR

...view details