తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పంజాబ్​లో కొత్త మంత్రివర్గం- నిరసనల మధ్యే...

పంజాబ్​లో నూతన మంత్రివర్గం (Punjab Cabinet) ప్రమాణస్వీకారం చేసింది. అమరీందర్ సింగ్​ ప్రభుత్వంలోని కొందరు మంత్రుల్ని తప్పించగా.. వారు అసంతృప్తి వెళ్లగక్కారు. (Punjab Cabinet news)

punjab cm charanjit singh
పంజాబ్ సీఎం చరణ్​జీత్ సింగ్

By

Published : Sep 26, 2021, 4:50 PM IST

Updated : Sep 26, 2021, 6:12 PM IST

పంజాబ్​లో నూతన మంత్రివర్గం (Punjab Cabinet) కొలువుదీరింది. ఎమ్మెల్యేలతో రాష్ట్ర గవర్నర్ బన్వర్​లాల్ పురోహిత్ ప్రమాణస్వీకారం చేయించారు. (Punjab Cabinet Ministers list 2021)

ప్రమాణస్వీకారం చేస్తున్న ఎమ్మెల్యే బ్రహ్మ మోహింద్ర
ప్రమాణస్వీకారం చేస్తున్న ఎమ్మెల్యే మన్​ప్రీత్ సింగ్ బాదల్

మొత్తం 15 మంది ఎమ్మెల్యేలు.. ప్రమాణస్వీకారం చేశారు. ఇందులో ఏడుగురు కొత్త వారు ఉన్నారు. కొత్తగా మంత్రి పదవి దక్కించుకున్నవారిలో రణ్​దీప్ సింగ్ నభా, రాజ్ కుమార్ వెర్కా, సంగత్ సింగ్ గిల్జియాన్, పర్గాత్ సింగ్, అమరీందర్ సింగ్ రాజా వారింగ్, గుర్​కీరత్ సింగ్ కోట్లి ఉన్నారు. 2018లో అవినీతి ఆరోపణలతో మంత్రి పదవికి రాజీనామా చేసిన రానా గుర్జిత్ సింగ్.. మరోసారి కేబినెట్ బెర్త్ దక్కించుకున్నారు.

కేబినెట్ మంత్రుల జాబితా
మంత్రివర్గ ప్రమాణస్వీకార కార్యక్రమంలో సీఎం చరణ్​జీత్

ఎమ్మెల్యేల అసంతృప్తి!

రాజ్​భవన్​లో జరిగిన ప్రమాణస్వీకార (Punjab Cabinet news) కార్యక్రమంలో సొంత ఎమ్మెల్యేలే నిరసన గళం వినిపించారు. అమరీందర్ సింగ్ ప్రభుత్వంలోని కొందరు మంత్రుల్ని ఈసారి పక్కనపెట్టారు. దీనిపై వారు తీవ్రస్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనిపై పలువురు ఎమ్మెల్యేలు.. కాంగ్రెస్ రాష్ట్ర చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ, ముఖ్యమంత్రి చన్నీకు లేఖ రాశారు. మాజీ మంత్రి రానా గుర్జిత్ సింగ్​ను మంత్రివర్గంలోకి తీసుకోవద్దని కోరారు. ఆయనకు బదులుగా దళిత నేతలకు కేబినెట్​లో (Punjab Cabinet news) స్థానం కల్పించాలని పేర్కొన్నారు.

"రానా గుర్జిత్ సింగ్ అవినీతిపరుడు. ఆయనను కేబినెట్​లోకి చేర్చుకోవడాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. మైనింగ్ కుంభకోణం విషయంలో 2018లో మంత్రివర్గం నుంచి తొలగించిన వ్యక్తిని ఇప్పుడు ఎందుకు తీసుకున్నారు? దోబా ప్రాంతంలో 38 శాతం దళితులు ఉన్నారు. కానీ కేబినెట్​లో ఈ వర్గానికి ప్రాతినిధ్యం కల్పించలేదు."

-లేఖ రాసిన ఎమ్మెల్యేలు

మరోవైపు, కేబినెట్ (Punjab Cabinet Ministers list 2021) నుంచి తప్పించడాన్ని తప్పుబడుతూ.. కెప్టెన్ మంత్రివర్గంలో పనిచేసిన బల్బీర్ సింగ్ సిద్ధూ, గుర్​ప్రీత్ సింగ్ కంగర్​ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. తమను మంత్రివర్గం నుంచి తొలగించడానికి కారణాలేంటని ప్రశ్నించారు. ఓ దశలో బల్బీర్ సింగ్ కన్నీటి పర్యంతమయ్యారు. తాము చేసిన తప్పేంటని ఆవేదన వ్యక్తం చేశారు.

అదే సమయంలో పలువురు ఎమ్మెల్యేలు రాష్ట్ర కేబినెట్​లో చేరేందుకు విముఖత చూపించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా తాము రాజీనామా చేశామని, కాబట్టి మళ్లీ కేబినెట్​లో చేరబోమని కాంగ్రెస్ ఎమ్మెల్యే కుల్జిత్ సింగ్ నగ్రా పేర్కొన్నారు.(Punjab Cabinet Ministers list 2021)

ఇవీ చదవండి:

Last Updated : Sep 26, 2021, 6:12 PM IST

ABOUT THE AUTHOR

...view details