చైనీస్ లోన్ యాప్ల పేరిట సైబర్ మోసాలకు పాల్పడుతున్న ఓ అంతర్జాతీయ ముఠాను గుర్తించారు ఉత్తరాఖండ్ టాస్క్ఫోర్స్ అధికారులు. ఈ కేసులో దిల్లీకి చెందిన అంకుర్ ధింగ్రీ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. అతడి వద్ద నుంచి ల్యాప్టాప్, ఫోన్, హార్డ్ డిస్క్, పదులకొద్ది బ్యాంకు ఏటీఎం కార్డులు, ఆధార్ కార్డులు, పాన్ కార్డులు, మెట్రో కార్డులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఈ ముఠాలో ఉన్న ఐదుగురు సభ్యులు చైనీయులే అని పోలీసులు తెలిపారు. వీరు హాంకాంగ్ నుంచి సైబర్ మోసాలకు పాల్పడుతున్నట్లు పేర్కొన్నారు.
"తక్కువ వడ్డీకే రుణాలు ఇస్తామని.. యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలని వినియోగదారులను సైబర్ నేరగాళ్లు మెసేజ్లు పంపుతారు. ఆ యాప్లను డౌన్లోడ్ చేసుకోగానే వినియోగదారుల మొబైల్లో ఉన్న ఫొటోలు, వీడియోలు సైబర్ నేరగాళ్లకు చేరిపోతాయి. దీంతో వినియోగదారుడు, అతడి కుటుంబ సభ్యుల ఫొటోలు, వీడియోలను అసభ్యకరమైన ఎడిట్ చేసి బ్లాక్మెయిల్ చేస్తారు. తాము అడిగిన డబ్బులు ఇవ్వకపోతే బాధితుల వ్యక్తిగత చిత్రాలను ఇంటర్నెట్లో పెడతామని బెదిరిస్తారు. ఈ సైబర్ నేరగాళ్లు 15 నకిలీ లోన్ యాప్స్ ద్వారా మోసాలకు పాల్పడుతున్నారు"