కుటుంబ సభ్యులు ఎవరైనా కరోనా బారిన పడితే ప్రభుత్వ ఉద్యోగులకు 15 రోజుల ప్రత్యేక సెలవు మంజూరు చేయనున్నట్టు కేంద్రం ప్రకటించింది. వీటిని ప్రత్యేక సెలవు దినాలుగా(స్పెషల్ క్యాజువల్ లీవ్) పరిగణిస్తామని తెలిపింది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను సిబ్బంది వ్యవహారాల శాఖ జారీ చేసింది.
ప్రత్యేక సెలవు దినాలు ముగిసిన తరువాత కూడా కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో చికిత్స పొందుతుంటే... ఈ ఉద్యోగులకు వారు డిశ్చార్జ్ అయ్యే వరకు సెలవులు ఇచ్చేందుకు అనుమతించాలని సంబంధిత విభాగాలకు సూచించింది కేంద్రం.