Uranium Smuggling India: ఇండో-నేపాల్ సరిహద్దులో భారీ కుట్ర భగ్నం చేశారు పోలీసులు. భారత్‌లోకి 2 కిలోల యురేనియంను అక్రమంగా తరలిస్తున్న ముఠాను పట్టుకున్నారు. మొత్తం 15 మంది స్మగ్లర్లను అరెస్టు చేశారు. యురేనియం ఎక్కడినుంచి వచ్చింది అనేది ఆరా తీస్తున్నారు.
నేపాల్ కాఠ్మాండూ మీదుగా భారత్‌లోని బిహార్‌కు పేలుడు పదార్థాల్లో ఉపయోగించే ప్రమాదకర యురేనియంను తరలిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో సరిహద్దులోని బిరాట్‌నగర్ వద్ద తనిఖీలు నిర్వహించగా.. నిందితులు పట్టుబడ్డారు. యురేనియంతో పాటు మరికొన్ని అనుమానస్పద వస్తువులను కూడా స్వాధీనం చేసుకున్నారు. బిహార్‌లోని అరారియా, జోగ్బానీ నుంచి స్మగ్లింగ్‌కు యత్నించినట్లు తెలుస్తోంది.
స్మగ్లర్మ అరెస్టు అనంతరం.. భారత భద్రత సంస్థలు, సశస్త్ర సీమా బల్(ఎస్ఎస్బీ) అప్రమత్తమయ్యాయి. సరిహద్దుల్లో భద్రతా చర్యలను మరింత పెంచాయి. యురేనియం విలువ రూ. కోట్లలో ఉంటుంది. దీనిని అణ్వాయుధ తయారీలోనూ ఉపయోగిస్తారు. ఒక కేజీ యురేనియం 24 మెగావాట్ల శక్తికి సమానం. దీంతో విధ్వంసమే సృష్టించే అవకాశముంది. భద్రతా దళాల అప్రమత్తంతో.. పెను ప్రమాదం తప్పింది.