తెలంగాణ

telangana

ETV Bharat / bharat

హైవేపై దొంగల బీభత్సం.. వాహనం ఆపి 1400 కిలోల వెండి అపహరణ - Thieves stoled silver in Gujarat

వెండి, ఆభరణాలతో వెళ్తున్న వాహనాన్ని రహదారిపై అడ్డుకొని చోరీకి పాల్పడ్డారు దొంగలు. ఏకంగా 1400 కిలోల వెండిని ఎత్తుకెళ్లిపోయారు. గుజరాత్​లో ఈ ఘటన జరిగింది.

1400-kg-of-silver-and-imitation-robbery-in-gujarath
1400 కిలోల వెండి ఎత్తుకెళ్లిన దొంగలు

By

Published : Feb 18, 2023, 10:51 PM IST

గుజరాత్​లో దొంగలు రెచ్చిపోయారు. ఏకంగా 1400 కిలోల వెండిని అపహరించుకుపోయారు. ఇమిటేషన్ జువెలరీని సైతం దొంగలు లూటీ చేశారు. అహ్మదాబాద్​-రాజ్​కోట్ హైవేపై ఈ ఘటన జరిగింది. వెండి, ఇతర ఆభరణాలతో వెళ్తున్న వాహనాన్ని దొంగలు సైలా ప్రాంతంలో అడ్డుకున్నారు. వాహనంలో ఉన్నవారిని బెదిరించి 1400 కేజీల వెండిని దోచుకున్నారు. వాహనంలోనే ఉన్న ఇతర ఆభరణాలను సైతం ఎత్తుకెళ్లారు.

రాజ్​కోట్​లోని చెందిన న్యూ ఎయిర్ సర్వీస్ అనే కొరియర్ కంపెనీ వీటిని రవాణా చేస్తోంది. పికప్ వ్యాన్​లో వెండి, ఆభరణాలు తీసుకొని డ్రైవర్, క్లీనర్ అహ్మదాబాద్​కు బయల్దేరారు. మూడు కారుల్లో వెళ్తున్న 6 నుంచి 8 మంది వ్యక్తులు.. సైలా గ్రామం వద్దకు ఆభరణాల వ్యాన్ రాగానే దాన్ని అడ్డుకున్నారు. డ్రైవర్​ను, క్లీనర్​ను బెదిరించారు. వారిని వాహనంలోనే బంధించి వ్యాన్ లోపల ఉన్న వెండి, ఆభరణాలు అపహరించారు. మొత్తం 1400 కిలోల వెండి, ఇమిటేషన్ జువెలరీని తమ కార్లలో నింపుకొని పరార్ అయ్యారు. ఆభరణాలు, వెండిని చోరీ చేసిన తర్వాత ఖాళీ పికప్ వాహనాన్ని అక్కడే వదిలేశారు దొంగలు. ఆ తర్వాత చాకచక్యంగా వ్యవహరించారు. డ్రైవర్​ను, క్లీనర్​ను అలాగే వదిలేస్తే వెంటనే పోలీసులకు చెబుతారన్న భయంతో వారిని తమతోనే తీసుకెళ్లిపోయారు. మోర్వాడ్ అనే గ్రామానికి దగ్గర్లో ఉన్న ఓ వంతెన వద్ద వారిని వదిలేశారు. చేతులకు తాళ్లు కట్టి వారిని పడేశారు.

1400 కిలోల వెండి ఎత్తుకెళ్లిన దొంగలు

ఈ ఘటన గురించి తెలియగానే కొరియర్ కంపెనీ మేనేజర్ వెంటనే ఆ ప్రాంతానికి చేరుకున్నారు. పోలీసులకు సమాచారం అందించారు. రాజ్​కోట్ ఐజీ అశోక్​కుమార్ యాదవ్, సురేంద్రనగర్ డీఎస్పీ హరీశ్ డుదాట్, లింబ్డి డీఎస్పీ సీపీ ముంధ్వా సహా పలువురు పోలీసు అధికారులు వెంటనే ఘటనాస్థలానికి వచ్చారు. నిందితులను పట్టుకునేందుకు వీరంతా ప్రయత్నిస్తున్నారు. జిల్లా సరిహద్దుల్లో అదనపు నిఘా పెట్టారు. వచ్చే పోయే ప్రతి వాహనాన్ని తనిఖీ చేస్తున్నారు. ప్రధానంగా హైవేలపై ఉన్న సీసీ కెమెరాలను గమనిస్తున్నారు. వివిధ బృందాలను రంగంలోకి దించి నిందితుల అరెస్ట్ కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు.

1400 కిలోల వెండి ఎత్తుకెళ్లిన దొంగలు

ABOUT THE AUTHOR

...view details