గుజరాత్ పటాన్ జిల్లాలో(pathan district news) దారుణం జరిగింది. ప్రేమించిన వ్యక్తితో వెళ్లిపోయిందన్న కారణంతో 14 ఏళ్ల బాలికను గ్రామస్థలు చిత్రహింసలకు గురిచేశారు(gujarat crime news). బాలికకు గుండుకొట్టించి.. ముఖానికి నలుపు రంగు పూసి ఊరేగించారు. బాలికను ప్రేమించిన వ్యక్తిపైనా ఇదే విధంగా ప్రవర్తించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది.
'బాలిక చర్యల వల్ల తమ తెగకు చెడ్డ పేరు వచ్చిందని.. ఆమెను 'శుద్ధి' చేసేందుకే ఈ శిక్ష విధించినట్లు,' "వాడి" తెగకు చెందిన గిరిజనులు(gujarat tribe) పేర్కొన్నారు. అనంతరం వారి వర్గానికి చెందిన మరో వ్యక్తికి బాలికను ఇచ్చి వివాహం జరిపించారు.