తెలంగాణ

telangana

ETV Bharat / bharat

సీఎంను కలిసేందుకు వచ్చిన వారిలో 14 మందికి కరోనా - బిహార్ ప్రజా దర్బార్​లో కొవిడ్

Janta Darbar Covid: ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు నిర్వహించే జనతా దర్బార్​లో కరోనా కలకలం సృష్టించింది. ఈ కార్యక్రమానికి వచ్చిన 14 మందికి కొవిడ్ పాజిటివ్​గా తేలింది. ఇందులో ముగ్గురు కానిస్టేబుళ్లు సైతం ఉన్నారు.

covid cases in janta darbar
covid cases in janta darbar

By

Published : Jan 3, 2022, 4:01 PM IST

Bihar CM Janta Darbar Covid: ప్రజల్ని నేరుగా కలిసి, వారి సమస్యలు వినేందుకు బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ నిర్వహించే జనతా దర్బార్​.. కరోనా వ్యాప్తికి వేదికైంది. ఈ కార్యక్రమానికి హాజరైన 14 మందికి కొవిడ్ పాజిటివ్​గా తేలింది. ఇందులో ముగ్గురు పోలీస్ కానిస్టేబుళ్లు ఉన్నారని అధికారులు తెలిపారు.

ప్రజాదర్బార్​కు వచ్చే పౌరులకు అక్కడికక్కడే యాంటీజెన్ పరీక్షలు నిర్వహించారు. ఇందులో 14 మందికి పాజిటివ్​గా తేలిందని అధికారులు తెలిపారు. దీంతో అప్రమత్తమైన అధికారులు అవసరమైన జాగ్రత్తలు తీసుకున్నారు.

ప్రజా దర్బార్​కు వెళ్లే ప్రధాన ద్వారం

Bihar covid cases

కరోనా వ్యాప్తిని దృష్టిలో ఉంచుకునే ముందుగానే పరిమిత సంఖ్యలో పౌరులను ప్రజా దర్బార్​కు అనుమతించినట్లు అధికారులు తెలిపారు. 200 కన్నా తక్కువ మందినే పిలిచినట్లు తెలిపారు. అయితే, కొన్ని నెలల క్రితమే ఆన్​లైన్ రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకొన్న కొంతమంది.. తమకు ఇంకా ప్రజాకోర్టుకు పిలుపు రాలేదన్న అసంతృప్తితో నేరుగా ఇక్కడికి వచ్చారని వివరించారు.

వైద్యులపై పడగ

మరోవైపు, బిహార్​లో వైద్యులపై కరోనా పంజా విసురుతోంది. పట్నాలోని నలంద వైద్య కళాశాల, ఆస్పత్రిలో(ఎన్ఎంసీహెచ్​) 87 మంది వైద్యులు కరోనా బారినపడడం కలకలం సృష్టించింది. ఎన్ఎంసీహెచ్​లో మొత్తం 194 నమూనాలకు ఆర్​టీ-పీసీఆర్​ పరీక్షలు నిర్వహించగా.. అందులో శనివారం 12 మందికి కరోనా సోకినట్లు తేలింది. మరో 75 మందికి ఆదివారం వైరస్​ నిర్ధరణ అయింది. అయితే.. కొవిడ్​ సోకిన వారిలో ఐదుగురు మాత్రమే ఆస్పత్రిలో చేరగా.. మిగతా వారంతా హోం ఐసొలేషన్​లో ఉన్నట్లు తెలుస్తోంది. అటు కోల్​కతాలో వంద మందికి పైగా వైద్యులు కరోనా బారిన పడ్డారు. దీనిపై పూర్తి వివరాల కోసం ఈ లింక్​పై క్లిక్ చేయండి.

ఇదీ చదవండి:టీనేజ్ వ్యాక్సినేషన్.. టీకా కేంద్రాల్లో పిల్లల సందడి..

ABOUT THE AUTHOR

...view details