ఉత్తర్ప్రదేశ్ ఉన్నావ్ జిల్లాలో ఉన్నతాధికారులు.. తమతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని, మానసికంగా వేధిస్తున్నారని 14 మంది వైద్యులు రాజీనామా చేశారు. ఈ మేరకు బుధవారం సాయంత్రం తమ రాజీనామా పత్రాలను జిల్లా ప్రధాన వైద్యాధికారి కార్యాలయంలో సమర్పించారు. తమ రాజీనామా కాపీని వైద్యశాఖ అదనపు ముఖ్య కార్యదర్శి కార్యాలయానికి పంపించారు.
సేవలు కొనసాగిస్తాం..
అయితే జిల్లా కలెక్టర్, ప్రధాన వైద్యాధికారితో చర్చలు ముగిసేంతవరకు కరోనా వైద్య సేవలు కొనసాగిస్తామని వైద్యులు తెలిపారు. వీరంతా.. జిల్లాలోని వివిధ ప్రాథమిక వైద్య కేంద్రాల్లో విధులు నిర్వర్తిస్తున్నారు.
" ఏడాది నుంచి గ్రామీణ ప్రాంతాల్లో వనరులు అరకొరగా ఉన్నా.. వైద్య సేవలు కొనసాగిస్తున్నాం. మాకు సహకరించాల్సిన ఉన్నావ్ జిల్లా కలెక్టర్, జిల్లా ప్రధాన వైద్యాధికారి.. మాతో అమర్యాదగా, అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. "