తూర్పు లద్దాఖ్‌లో ఏర్పడిన సరిహద్దు ప్రతిష్ఠంభనకు (India China standoff) పరిష్కారం దిశగా నేడు భారత్-చైనా మధ్య మరో దఫా చర్చలు జరగనున్నాయి. ఆదివారం ఇరుదేశాల సైనికాధికారుల(India China border) మధ్య 13వ విడత చర్చలు జరుగుతాయని భారత ఆర్మీ వర్గాలు తెలిపాయి. వాస్తవాధీన రేఖ వెంబడి ఉన్న మోల్డో సెక్టార్ వద్ద సమావేశం జరగనుందని వెల్లడించాయి. ఉదయం 10.30 గంటలకు సమావేశం(India China latest news) ప్రారంభమవుతుందని స్పష్టం చేశాయి.
హాట్‌స్ప్రింగ్ వద్ద ఉన్న ఘర్షణాత్మక ప్రాంతాలపై ఈ భేటీలు సైనికాధికారులు చర్చిస్తారని అధికార వర్గాలు తెలిపాయి. భారత్ తరపున చర్చల బృందానికి లేహ్‌లోని 14 కార్ప్స్ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ పీజీకే మీనన్ నేతృత్వం వహించనున్నారు.
వాస్తవాధీన రేఖ వెంబడి ప్రతిష్టంభనను సత్వరమే పరిష్కరించుకోవాలని భారత సైన్యం భావిస్తోంది. దెస్పంగ్, దెమ్చోక్ ప్రాంతాల్లోనూ ప్రతిష్టంభనకు తెరదించాలని అనుకుంటోంది. ఇటీవల చైనా సైన్యం చొరబాటు ఘటనలు వెలుగు చూసిన నేపథ్యంలో తాజా సైనిక చర్చలకు ప్రాధాన్యం ఏర్పడింది.