తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Covid Cases: కేరళలో మళ్లీ పెరిగిన వైరస్​ కేసులు - కరోనా మరణాలు

కేరళలో కరోనా(Corona cases) కేసులు మళ్లీ పెరిగాయి. ఆ రాష్ట్రంలో కొత్తగా 13,383 కేసులు వెలుగుచూశాయి. ఇక మహారాష్ట్రలో ఒక్కరోజే 3వేలకు పైగా కొవిడ్ కేసులు నమోదవగా.. తమిళనాడులో 1,604 మందికి వైరస్​ సోకింది.

COVID-19 cases
కరోనా కేసులు

By

Published : Aug 23, 2021, 10:40 PM IST

కేరళలో కరోనా (Corona cases) విజృంభణ కొనసాగుతోంది. క్రితం రోజుతో పోలిస్తే కేసుల సంఖ్య పెరిగింది. రాష్ట్రంలో కొత్తగా 13,383 కేసులు నమోదయ్యాయి. మరో 21,942 మంది కోలుకోగా.. మహమ్మారి ధాటికి 90 మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 38.27 లక్షలకు చేరింది.

మహారాష్ట్రలో కొత్తగా 3,643 కరోనా కేసులు వెలుగు చూశాయి. మరో 105 మంది చనిపోగా.. కొత్తగా 6,795 మంది వైరస్​ నుంచి కోలుకున్నారు.

దేశ రాజధాని దిల్లీలో.. 17 మందికి వైరస్​ సోకింది. కరోనా కారణంగా ఎవరూ ప్రాణాలు కోల్పోలేదు.

ఇతర రాష్ట్రాల్లో ఇలా..

  • తమిళనాడులో 1,604 మంది మహమ్మారి బారినపడ్డారు. 1,863 మంది వైరస్ నుంచి కోలుకోగా.. మరో 25 మంది ప్రాణాలు కోల్పోయారు.
  • కర్ణాటకలో కొత్తగా 1,151 కరోనా కేసులు నమోదయ్యాయి. 1,442 మంది కోలుకోగా.. 10 మంది మృతిచెందారు.
  • మిజోరంలో 292 మందిలో వైరస్​ నిర్ధరణ అయ్యింది. మరో ఆరుగురు చనిపోయారు.
  • ఒడిశాలో కొత్తగా 761 మందికి కరోనా సోకగా.. 68 మంది ప్రాణాలు కోల్పోయారు.
  • జమ్ముకశ్మీర్​లో 93, గోవాలో 57, అరుణాచల్​ప్రదేశ్​లో 49, నాగాలాండ్​లో 33, గుజరాత్​లో​ 14, ఉత్తర్​ప్రదేశ్​లో 7, మధ్యప్రదేశ్​లో 3 కరోనా కొత్త కేసులు వెలుగు చూశాయి.
  • ఉత్తరాఖండ్​లో కర్ఫ్యూను మరో ఏడు రోజుల పాటు పొడిగిస్తూ అక్కడి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

టీకా పంపిణీ ఇలా..

దేశ వ్యాప్తంగా 58.82 కోట్ల మందికి వ్యాక్సిన్​ వేసినట్లు కేంద్రం తెలిపింది. ఒక్కరోజులోనే 56 లక్షలకు మందికి పైగా టీకా తీసుకున్నట్లు పేర్కొంది.

ఇదీ చూడండి:కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ సర్టిఫికెట్ల జారీపై కేంద్రం కీలక నిర్ణయం!

ABOUT THE AUTHOR

...view details