తెలంగాణ

telangana

ETV Bharat / bharat

చిన్నారి వినూత్న​ ఆలోచనతో 'స్మార్ట్ శౌచాలయం' - స్మార్ట్​ శౌచాలయాల నిర్మాణం

ఇరుకైన ప్రదేశాల్లో శౌచాలయాలు కట్టుకునేందుకు 13 ఏళ్ల బాలిక వినూత్నంగా ఆలోచించింది. స్మార్ట్​ వాష్​రూమ్​ నమూనాను రూపొందించింది. పలువురి మన్ననలు పొందుతోన్న ఈ హిమాచల్​ ప్రదేశ్​ చిన్నారి స్మార్ట్​ వాష్​రూమ్​ విశేషాలేంటో తెలుసుకోండి.

13-year-old from Himachal builds smart washroom
చిన్నారి వినూత్న​ ఆలోచనతో 'స్మార్ట్ శౌచాలయం'

By

Published : Feb 7, 2021, 3:13 PM IST

దేశంలో జనాభా పెరుగుతున్న కొద్దీ ఇళ్ల స్థలాల పరిమితికి ఇక్కట్లు పెరుగుతూ వస్తున్నాయి. ముఖ్యంగా మహానగరాల్లో ఈ సమస్య ఎక్కువగా ఉంది. ఇలాంటి ప్రదేశాల్లో శౌచాలయాలు నిర్మించడం పెద్ద సవాల్​గా మారుతోంది. అయితే తన వినూత్న ఆలోచనతో ఈ సమస్యకు పరిష్కారం చూపేందుకు యత్నించింది ఓ పదమూడేళ్ల చిన్నారి. హిమాచల్​ ప్రదేశ్​ హమీర్​పూర్​ జిల్లాకు చెందిన సుదీక్ష ఠాకూర్​ ఓ 'స్మార్ట్​ వాష్​ రూమ్'​ నమూనాను రూపొందించి అందరి మన్ననలు పొందుతోంది.

స్మార్ట్​ వాష్​రూమ్​ నమూనా

రెండు విధాలుగా....

ఈ స్మార్ట్​ వాష్​ రూమ్​ను రెండు విధాలుగా ఉపయోగించేలా రూపొందించింది సుదీక్ష. శుభ్రతతో పాటు, సదుపాయాలు సౌలభ్యంగా ఉండేలా దీన్ని తయారు చేసింది. ఇండియన్​, వెస్టర్న్​ విధానాల్లో ఈ శౌచాలయాన్ని ఉపయోగించొచ్చని చెబుతోంది.

సుదీక్ష ఠాకూర్​ తయారు చేసిన ఈ స్మార్ట్​ వాష్ రూమ్ నమూనా... జాతీయ స్థాయి పోటీలకు ఎంపికవడం విశేషం.

వాషింగ్​ మెషీన్​తో పాటు గీసర్​ కూడా...

శౌచాలయం చిన్నగా ఉన్నా దాన్ని పలువిధాలుగా ఉపయోగించేలా అభివృద్ధి చేసింది దీక్షిత. దాదాపు 16 చదరపు అడుగుల స్థలంలోనే దీన్ని నిర్మించుకోవొచ్చని చెబుతోంది. మినీ వాషింగ్ మెషీన్, గీసర్​ కూడా ఇందులో ఏర్పాటు చేయడం గమనార్హం.

స్క్వాట్​ టాయిలెట్​ షీట్​పై ఓ కప్పును ఏర్పాటు చేసుకునేలా నమూనాను రూపొందించింది దీక్షిత. దీంతో, ఆ శౌచాలయాన్ని స్నానపుగదిగా ఉపయోగించుకునేలా చేసింది. అందులో బట్టలు కూడా ఉతుక్కునే వీలుంటుందని చెబుతోంది.

సుదీక్ష ఈ ఘనత సాధించడంపై ఆమె తండ్రి సంజీవ్​ ఠాకూర్ హర్షం వ్యక్తం చేశారు. ఆయన ఓ ప్రభుత్వ పాఠశాలలో సైన్సు టీచర్​గా పనిచేస్తున్నారు. ఈ నమూనా ఇన్​స్పైర్​ పోటీల్లో టాప్​గా నిలిచిందని జిల్లా సైన్స్​ సూపర్​వైజర్ సుధీర్ ఛందేల్ తెలిపారు. ఇది జాతీయ స్థాయికి ఎంపికైనట్లు గుర్తుచేశారు. అయితే.. మెట్రోపాలిటన్​ నగరాల్లో ఇలాంటి స్మార్ట్​ వాష్​రూమ్​ల అవసరం ఎక్కువగా ఉంటుందని ఠాకూర్​ తెలిపింది.

ఇదీ చదవండి:నావికాదళ సైనికుడి దారుణ హత్య!

ABOUT THE AUTHOR

...view details