తెలంగాణ

telangana

ETV Bharat / bharat

శ్రీలంక టు ధనుష్​కోడి.. 13 గంటల్లోనే ఈది చరిత్ర సృష్టించిన దివ్యాంగురాలు - ఆటిజం

శ్రీలంక, ధనుష్​కోడి మధ్య ఉన్న బక్​జల జంక్షన్​ను 13 గంటల్లోనే ఈది కొత్త రికార్డు నెలకొల్పింది భారత పారా స్విమ్మర్ రియా రాయ్. ఆదివారం సాయంత్రం ఈ ఘనత సాధించింది. ఇందుకు అభినందిస్తూ తమిళనాడు డీజీపీ ఆమెను సన్మానించారు.

Autistic girl swimming
శ్రీలంక టు దనుష్​కోడి.. 13 గంటల్లోనే ఈది చరిత్ర సృష్టించిన బాలిక

By

Published : Mar 21, 2022, 1:44 PM IST

Updated : Mar 21, 2022, 6:14 PM IST

శ్రీలంక టు ధనుష్​కోడి.. 13 గంటల్లోనే ఈది చరిత్ర సృష్టించిన దివ్యాంగురాలు

Autistic girl swimming: భారత్​కు చెందిన పారా స్విమ్మర్​ జియా రాయ్​ సరికొత్త రికార్డు సృష్టించింది. శ్రీలంక తలైమన్నార్​, తమిళనాడు రామేశ్వరం ​ మధ్య ఉన్న బక్​జల జంక్షన్​ను 13 గంటల్లోనే ఈదేసింది. ఆదివారం సాయంత్రం ఈ ఘనత సాధించింది.

Jiya Roi

సముద్రంలో ఈదుతున్న బాలిక

జియా ఆటిజంతో భాదపడుతోంది. సరిగ్గా మాట్లాడలేదు. ఆమె తండ్రి మదన్​ రాయ్​ ముంబయిలో నావికాదళ అధికారిగా పని చేస్తున్నారు. వైద్యుల సూచన మేరకు జియాకు రెండేళ్ల వయసు నుంచే స్విమ్మింగ్ నేర్పించారు. దీంతో ఆమె ఈ పోటీల్లో రికార్డులు సృష్టిస్తూ వస్తోంది. ఓపెన్ వాటర్​ స్విమ్మింగ్​లో గంటకు 14కిలోమీటర్ల వేగంతో ఈదిన రికార్డు కూడా ఆమె పేరిటే ఉంది.

సముద్రంలో ఈదుతున్న బాలిక.. పడవలో నౌకాదళ సిబ్బంది

ఆదివారం సాయంత్రం 5:25 గంటలకు జియా ధనుష్​కోడి, తలైమన్నార్​ మధ్య ఉన్న పాక్​ స్ట్రెయిట్​ను దాటి, అరిచాల్​మునాయ్ బీచ్ చేరుకుంది. తమిళనాడు డీజీపీ సీ శైలేంద్ర బాబు ఆమెకు ఘన స్వాగతం పలికారు. బాలిక రికార్డు సాధించినందుకు పుష్పగుచ్ఛం ఇచ్చి సన్మానించారు. 2017లో శైలేంద్ర బాబు కూడా పాక్​ స్ట్రెయిట్​ను ఈదడం గమనార్హం.

Swimming News

ఆటిజంతో బాధపడుతున్న బాలిక ఈ రికార్డు సృష్టించడం అద్భుతమని డీజీపీ కొనియాడారు.

బాలికకు పుష్పగుచ్చం ఇస్తున్న తమిళనాడు డీజీపీ

"దేశంలో హిమాలయాలపై కూడా ట్రెక్కింగ్​ చేయగల ట్రెక్కర్లు చాలామంది ఉన్నారు. కానీ స్విమ్మర్లు చాలా తక్కువ సంఖ్యలో ఉన్నారు. స్విమ్మింగ్​లో రికార్డులు సృష్టించడానికి యువత ఆసక్తితో ముందుకురావాలి. ఈ సముద్రం ఇతర సముద్రాల్లా కాదు. ఈ నీటిలో ప్రమాదకరమైన మిల్క్​ షార్క్​లు, జెల్లీ ఫిష్​లు ఉంటాయి. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లోనూ పాక్​ స్ట్రెయిట్​ను ఈదడం గొప్ప విషయం. ఇక్కడ ఉదయం వేళల్లో కంటే రాత్రి వేళలో ఈదడం సులభం."

-తమిళనాడు డీజీపీ శైలేంద్ర బాబు

ఆదివారం సముద్రంలోకి దిగిన తర్వాత మొదటి మూడు గంటలు తన కూతురికి కష్టంగా అనిపించిందని, కానీ 13 గంటలు బంగాళాఖాతంలో ఈది గొప్ప ఘనత సాధించడం ఆనందంగా ఉందని జియా రాయ్​ తండ్రి మదన్ రాయ్ తెలిపారు.

బాలికను సన్మానిస్తున్న తమిళనాడు డీజీపీ

Autism Girl Swimming News

13 ఏళ్ల జియా నేవీ చిల్డ్రన్​ స్కూల్​లో చదువుతోంది. ఓపెన్​ వాటర్ స్విమ్వింగ్​ విభాగంలో ఈ ఏడాది ప్రధానమంత్రి బాల పురస్కార్​ అవార్డు కూడా ఆమెను వరించింది. జియా గతేడాది బాంద్రా-వర్లీ సీ లింక్ నుంచి గేట్‌వే ఆఫ్ ఇండియా వరకు 36 కి.మీ దూరాన్ని 8 గంటల 40 నిమిషాల్లోనే ఈది చరిత్ర సృష్టించింది. ఇప్పుడు మరోసారి తన సత్తా చాటి అందరి మన్ననలు పొందుతోంది.

శ్రీలంక టు దనుష్​కోడి.. 13 గంటల్లోనే ఈది చరిత్ర సృష్టించిన బాలిక
చూసేందుకు తరలివచ్చిన జనం

ఇదీ చదవండి:ఎనిమిదేళ్ల బాలికపై హత్యాచారం.. ఇసుకలో కప్పి పెట్టి..

Last Updated : Mar 21, 2022, 6:14 PM IST

ABOUT THE AUTHOR

...view details