తెలంగాణ

telangana

ETV Bharat / bharat

లిఫ్ట్​లో 13 మంది.. రెండున్నర గంటల నరకం.. చివరకు సాహసం! - లిఫ్ట్​లో ఇరుక్కుపోయిన 13 మంది లేటెస్ట్ న్యూస్

13 Passengers Trapped In Lift: రైల్వేస్టేషన్‌ లిఫ్ట్‌లో ఇరుక్కుపోయిన 13 మంది ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు రైల్వే సిబ్బంది. వీరిలో ఏడాదిన్నర చిన్నారి కూడా ఉంది. తమిళనాడులోని నుంగంబాక్కం రైల్వే స్టేషన్​లో ఈ ఘటన జరిగింది.

13 includes a toddler trapped in the lift
లిఫ్ట్​లో ఇరుక్కుపోయిన 13 మంది

By

Published : Mar 14, 2022, 1:09 PM IST

13 Passengers Trapped In Lift: తమిళనాడు, చెన్నైలోని నుంగంబాక్కం రైల్వే స్టేషన్​ లిఫ్ట్‌లో 13 మంది ఇరుక్కుపోయారు. వీరిలో ఏడాదిన్నర చిన్నారి కూడా ఉంది. దాదాపు రెండున్నర గంటల తర్వాత సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు రైల్వే సిబ్బంది.

రైల్వే స్టేషన్ లిఫ్టులో ఇరుక్కుపోయిన ప్రయాణికులు

ఏం జరిగిందంటే..?

ఆదివారం రాత్రి 8 గంటల సమయంలో చెన్నై నుంగంబాక్కం రైల్వే స్టేషన్‌లో ఏడాదిన్నర చిన్నారి సహా 13 మంది లిఫ్ట్‌ ఎక్కారు. లిఫ్ట్‌ మధ్యలోనే ఆగిపోయింది. తోటి ప్రయాణికులు ఇచ్చిన సమాచారంతో రైల్వే సాంకేతిక సిబ్బంది రంగంలోకి దిగి లిఫ్ట్‌ను సరిచేసేందుకు అనేక ప్రయత్నాలు చేశారు. అయినా లిఫ్ట్‌ కదల్లేదు.

లిఫ్టు బయట గుమిగూడిన ప్రజలు

ఏం చేయాలో తోచని రైల్వే అధికారులు, పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సాయం కోరారు. వారు వచ్చి లిఫ్ట్‌ పైన ఉండే ఫ్యాన్‌ తొలిగించి ఆ రంధ్రం నుంచి ఒక్కో ప్రయాణికుడిని బయటకు తీసుకొచ్చారు. దాదాపు రెండున్నర గంటలు లిఫ్ట్‌లోనే ఇరుక్కుపోయిన ప్రయాణికులు క్షేమంగా బయటకు రావడం వల్ల అంతా ఊపిరి పీల్చుకున్నారు.

ఇదీ చూడండి:'నా భార్య ఆడది కాదు.. నేను మోసపోయా న్యాయం చేయండి'

ABOUT THE AUTHOR

...view details