13 Thousand Nude Photos In Lover Mobile : తన ప్రియుడి ఫోన్లో 13వేల న్యూడ్ఫొటోలను చూసి ఓ యువతి షాక్ అయింది. అనుకోకుండా తన బాయ్‌ఫ్రెండ్ ఫోన్లో గ్యాలరీని చూసిన యువతి ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన కర్ణాటకలోని బెంగళూరులో జరిగింది.
ఇంతకీ ఏం జరిగిందంటే?
బాధితురాలు బెల్లందూరులో ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగి. అదే సంస్థలో పనిచేస్తున్న 25 ఏళ్ల యువకుడితో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఈ క్రమంలోనే వారు సన్నిహితంగా ఉండేవారు. వారిద్దరి రహస్య వీడియోలను నిందితుడు ఫోన్లో రికార్డు చేశాడు. వాటిని తొలగించాలని ప్రియుడిని యువతి పలుమార్లు కోరింది. అయినప్పటికీ నిందితుడు వాటిని ఫోన్ నుంచి డిలీట్ చేయలేదు.
ఇలా ఉండగా ఓ రోజు నిందితుడికి తెలియకుండా అతడి ఫోన్‌ను బాధితురాలు తీసుకుంది. ఆ ఫోన్లో గ్యాలరీ ఓపెన్ చేయగా.. అందులో యువకుడు తన సహోద్యోగితో సహా వివిధ మహిళలకు చెందిన నగ్న ఫొటోలు ఉన్నాయి. దీంతో విస్తుపోయిన యువతి.. ప్రియుడి వ్యవహారాన్ని కంపెనీ లీగల్ ఎగ్జిక్యూటివ్‌కు ఈ విషయాన్ని తెలియజేసింది. ఈ విషయంపై నవంబర్ 23న కంపెనీ ప్రతినిధి బారుబర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేపట్టారు.