Mushroom Deaths: అసోంలోని దిబ్రూగఢ్‌లో విషాద ఘటన చోటు చేసుకుంది. విషపూరిత పుట్టగొడుగులు తిని వారం రోజుల వ్యవధిలో 13 మంది మృతి చెందారు. పుట్టగొడుగులు తిని అస్వస్థతకు గురైన మరో 26 మందికి దిబ్రూగఢ్‌లోని అసోం మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు. పుట్టగొడుగులు తిన్న వారిలో కిడ్నీ, కాలేయ సమస్యలు వచ్చినట్టు వైద్యులు తెలిపారు.
పుట్టగొడుగులు తిని 13 మంది మృతి - పుట్టగొడుగులు
Poisonous mushrooms: విషపూరిత పుట్టగొడుగులు తిని 13మంది మృతి చెందిన ఘటన అసోంలో జరిగింది. మరో 26 మంది అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
13 మంది మృతుల్లో మైనర్ కూడా ఉన్నట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్ డా.ప్రశాంత దిహింగియా వెల్లడించారు. బాధితులంతా దిబ్రూగఢ్, తిన్‌సుఖియా, శివసాగర్, చరాయిదేవ్ జిల్లాలకు చెందిన వారని చెప్పారు. ఈ ప్రాంతాల్లో ప్రతిఏటా విషపూరిత పుట్టగొడుగులు తిని చాలా మంది అస్వస్థతకు గురై ఆస్పత్రుల్లో చేరుతారని వివరించారు. బాధితులంతా తేయాకు తోటల ప్రాంతాల్లోనే నివసిస్తారని, అక్కడ పండే పుట్టగొడుగులు తింటారని పేర్కొన్నారు.
ఇదీ చదవండి:మామిడి పండ్లు కిలో రూ.2.70లక్షలు- సెక్యూరిటీ కోసం 15 సూపర్ డాగ్స్!