దేశంలో కరోనా ఉధృతి నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఉచిత వ్యాక్సినేషన్‌ను ప్రారంభించాలని విపక్షాలకు చెందిన 13 మంది నేతలు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఓ సంయుక్త ప్రకటనలో అభ్యర్ధిస్తూ.. కేంద్రానికి రాసిన ఈ లేఖపై.. మాజీ ప్రధాని దేవెగౌడ, కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ సహా 13 మంది నేతలు ఈ ప్రకటనపై సంతకం చేశారు.
ఆసుపత్రులు, ఆరోగ్య కేంద్రాలకు నిరంతరాయంగా ఆక్సిజన్ సరఫరా చేయాలని కోరారు. వ్యాక్సినేషన్ కోసం బడ్జెట్‌లో కేటాయించిన 35వేల కోట్ల రూపాయలను దీని కోసం తప్పకుండా వినియోగించాలని విపక్ష నేతలు ఈ సంయుక్త ప్రకటలో సూచించారు.