బిహార్లో భారీ వర్షాలతో జన జీవనం స్తభించిపోయింది. వర్షాలకు తోడు పిడుగులు ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా పిడుగులు పడి 13 మంది ప్రాణాలు కోల్పోయారు. పదుల సంఖ్యలో జంతువులు మరణించాయి.
పశువులు మేపేందుకు వెళ్లి..
భగల్పుర్ జిల్లాలోని జగ్దీశ్పుర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం పిడుగులు పడి ముగ్గురు మరణించారు. మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. పశువులు మేపేందుకు వెళ్లి ఇళ్లకు తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగినట్లు స్థానికులు తెలిపారు. వర్షం రావటం వల్ల ఓ చెట్టు కిందకు వెళ్లగా పిడుగు పడినట్లు చెప్పారు. మృతులు.. శ్రీరాం యాదవ్(46), కైలాశ్ యావద్(58)లు ఘటనా స్థలంలోనే కన్నుమూశారు. సుజిత్ కుమార్, ఆనంద్ కుమార్ (14)కు తీవ్ర గాయాలు కాగా.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు.
సుపాల్ జిల్లా సంపత గ్రామంలో పిడుగుపాటుతో ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. సమస్తిపుర్ జిల్లా సరాయ్రంజన్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో ఓ కూలి మరణించాడు. పొలంలో పనులు చేస్తున్న క్రమంలో పిడుగు పడినట్లు పోలీసులు తెలిపారు.
జమూయ్ జిల్లాలోని భగ్రార్ గ్రామంలో పిడుగుపాటుకు ఒకరు బలయ్యారు. పశువులను మేపేందుకు పొలానికి వెళ్లగా పిడుగు పడి సీతారాం యాదవ్ మరణించాడని స్థానికులు తెలిపారు. ఇదే జిల్లాలో ఓ మహిళ కూడా పిడుగుపాటుకు బలయ్యింది. పదుల సంఖ్యలో పశువులు ప్రాణాలు కోల్పోయాయి.
సోదరికి మిఠాయిలు ఇచ్చేందుకు వెళ్లి..