తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పునీత్ ద్వాదశ దినకర్మ- 40 వేల మంది అభిమానులు హాజరు

కన్నడ నటుడు పునీత్ రాజ్​కుమార్ (Puneeth Rajkumar news) ద్వాదశ దినకర్మను ఆయన కుటుంబ సభ్యులు.. కంఠీరవ స్టూడియోస్​లో నిర్వహించారు. మంగళవారం జరిగిన ఈ కార్యక్రమానికి 40 వేల మంది అభిమానులు హాజరయ్యారు. వీరందరికీ భోజన వసతి ఏర్పాటు చేశారు.

12th day ceremony for Puneeth Rajkumar
12th day ceremony for Puneeth Rajkumar

By

Published : Nov 10, 2021, 9:57 AM IST

Updated : Nov 10, 2021, 1:38 PM IST

పునీత్ ద్వాదశ దినకర్మ- 40 వేల మంది అభిమానులు హాజరు

కర్ణాటక సుప్రసిద్ధ నటుడు, దివంగత పునీత్ రాజ్​కుమార్ (Puneeth Rajkumar news) ద్వాదశ దినకర్మ కార్యక్రమాన్ని ఆయన కుటుంబ సభ్యులు నిర్వహించారు. కంఠీరవ స్టూడియోస్​లో పునీత్ సమాధి (Puneeth Rajkumar death date) ఉన్న ప్రాంతంలో మంగళవారం.. పూజలు చేశారు. పునీత్ భార్య అశ్వినీ, కూతుర్లు ధృతి, వందిత సహా కుటుంబ సభ్యులు పునీత్​కు నివాళులు అర్పించారు.

కంఠీరవ స్టూడియోస్​లో పునీత్ సమాధి వద్ద ఆయన చిత్రపటం
పునీత్ సమాధి వద్ద ఆయన కుటుంబ సభ్యులు

ఈ సందర్భంగా కంఠీరవ స్టూడియోస్​లో ఆహార పంపిణీ చేపట్టారు. పునీత్ సోదరులు శివరాజ్​కుమార్, రాఘవేంద్ర రాజ్​కుమార్, భార్య అశ్వినీ.. అభిమానులకు భోజనం వడ్డించారు. 40 వేల మందికి పైగా అభిమానులు ఈ కార్యక్రమానికి వచ్చారు. వీరందరికీ భోజనం ఏర్పాటు చేశారు. సుమారు వెయ్యి మంది చెఫ్​లు వంటలను సిద్ధం చేశారు. వెజ్, నాన్-వెజ్ వెరైటీలను అందుబాటులో ఉంచారు.

ఆహారం వడ్డిస్తున్న పునీత్ సోదరుడు

రక్తదాన, నేత్రదాన శిబిరాలు..

భోజనంతో పాటు రక్తదాన శిబిరం, నేత్రదాన శిబిరాలనూ కంఠీరవ స్టూడియోస్​లో ఏర్పాటు చేశారు. నటుడు శివరాజ్ కుమార్ ఈ శిబిరాలను ప్రారంభించి.. రక్తదానం చేశారు. అభిమానులు సైతం రక్తదానం చేసి.. నేత్ర దానానికి సంబంధించిన పత్రాలపై సంతకం చేశారు.

భారీగా తరలివచ్చిన అభిమానులు

భారీ సంఖ్యలో అభిమానులు హాజరవుతారన్న అంచనాల నేపథ్యంలో.. ముందుగానే కంఠీరవ స్టూడియోస్ వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ఐదుగురు ఏసీపీలు, 30 మంది ఇన్​స్పెక్టర్​లు సహా.. 1,123 మంది పోలీసులు బందోబస్తులో పాల్గొన్నారు.

అక్టోబర్ 29న పునీత్ రాజ్​కుమార్(46) కన్నుమూశారు. వ్యాయామాలు చేస్తూ గుండెపోటుతో మరణించారు.

ఇదీ చదవండి:

Last Updated : Nov 10, 2021, 1:38 PM IST

ABOUT THE AUTHOR

...view details