చిన్ననాటి నుంచి మిమిక్రీపై ఉండే ఆసక్తి ఓ కుర్రాడికి ఏకంగా రికార్డును తెచ్చిపెట్టింది. ఓ మనిషిని చూసి రెండు నిమిషాలు వారి గొంతు వింటే మూడో నిమిషానికి వారిని అనుకరిస్తూ మాట్లాడతాడు ఆ యువకుడు. ఈ ప్రతిభతోనే కేవలం ఆరు నిమిషాల్లో 128 మందిలా మాట్లాడి ఇండియా బుక్ ఆఫ్ రికార్డుల్లో స్థానం సంపాదించాడు తమిళనాడు కోయంబత్తూర్‌కు చెందిన గణపతి(19).
6 నిమిషాలు.. 128 గొంతులు..
గణపతికి మిమిక్రీ మీద ఉన్న ఆసక్తిని కాస్తా.. కళగా మార్చుకున్నాడు. దీంతో సమాజంలో ఉండే వివిధ రంగాల పెద్ద మనుషుల గొంతులను అనుకరించి మాట్లాడడం సాధన చేశాడు. ప్రైవేటు కాలేజీలో చదువుతున్న గణపతి.. మొదటగా సినీ తారల వాయిస్‌ను అనుకరించడం మొదలు పెట్టాడు. ఆ తరువాత రాజకీయ నాయకులను, కార్టూన్లను ఇమిటేట్ చేశాడు. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం ప్రసంగాన్ని అచ్చం అలానే మిమిక్రీ చేయగడు ఈ యువకుడు. ఇలా ఆరు నిమిషాల్లో 128 మంది గొంతులను అనుకరించి రికార్డు సాధించారు.