తెలంగాణ

telangana

ETV Bharat / bharat

India covid cases: దేశంలో మరో 12,500 కేసులు.. 500 మరణాలు - కరోనా మరణాల

దేశం​లో కొవిడ్​ కేసుల సంఖ్య (India covid cases) స్వల్పంగా తగ్గింది. తాజాగా 12,516 మందికి వైరస్​ (Corona cases in India) సోకింది. కరోనా ధాటికి​ మరో 501 మంది ప్రాణాలు కోల్పోయారు.

India covid cases
భారత్​లో కొవిడ్​ కేసులు

By

Published : Nov 12, 2021, 9:43 AM IST

Updated : Nov 12, 2021, 10:21 AM IST

భారత్​లో రోజువారీ కరోనా కేసుల్లో (India covid cases) తగ్గుదల నమోదైంది. కొత్తగా 12,516 మంది కొవిడ్​(Corona cases in India) బారిన పడ్డారు. వైరస్​ ధాటికి మరో 501 మంది మరణించారు. ఒక్కరోజే 13,155 మంది కొవిడ్​ నుంచి కోలుకున్నారు. మొత్తం యాక్టివ్​ కేసులు 267 రోజుల కనిష్ఠానికి చేరాయి.

  • మొత్తం కేసులు: 3,44,14,186
  • మొత్తం మరణాలు: 4,62,690
  • యాక్టివ్​ కేసులు: 1,37,416
  • కోలుకున్నవారు: 3,38,14,080

టీకాల పంపిణీ​..

దేశంలో కొవిడ్​ టీకా పంపిణీ (Vaccination in India) జోరుగా కొనసాగుతోంది. గురువారం ఒక్కరోజే 53,81,889 డోసుల వ్యాక్సిన్​ అందించారు. ఫలితంగా మొత్తం టీకా డోసుల పంపిణీ 1,10,79,51,225కు చేరింది.

ప్రపంచవ్యాప్తంగా..

ప్రపంచవ్యాప్తంగా రోజువారీ కరోనా​ కేసులు(coronavirus worldwide) తగ్గాయి. ఒక్కరోజే.. 4,96,395 మందికి వైరస్​ పాజిటివ్​గా (Corona update) తేలింది. కరోనా​ ధాటికి 6,575 మంది మృతి చెందారు. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 25,26,35,821కి పెరిగింది. మొత్తం మరణాలు 50,95,268కి చేరాయి.

వివిధ దేశాల్లో కొత్త కేసులు..

దేెశం కొత్త కేసులు కొత్త మరణాలు
జర్మనీ 50,377 223
అమెరికా 43,596 539
బ్రిటన్​ 42,408 195
రష్యా 40,759 1,237
టర్కీ 24,898 197
ఉక్రెయిన్​ 24,747 652

ఇదీ చూడండి:ఐదేళ్లలోపు చిన్నారులకు కరోనా పరీక్షలు అక్కర్లేదు!

Last Updated : Nov 12, 2021, 10:21 AM IST

ABOUT THE AUTHOR

...view details