తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Covid cases in India: దేశంలో మరో 12,514 మందికి వైరస్​ - కరోనా పరీక్షలు

దేశంలో కొత్తగా 12,514 మంది​కి కొవిడ్(Coronavirus update) ​​​సోకినట్లు తేలింది. వైరస్ ధాటికి(Covid cases in India) మరో 251 మంది మృతి చెందారు. ఒక్కరోజే 12,718మంది కరోనా నుంచి కోలుకున్నారు.

Covid cases
కరోనా కేసులు

By

Published : Nov 1, 2021, 9:52 AM IST

భారత్​లో కరోనా(Coronavirus update) వ్యాప్తి తగ్గుముఖం పడుతోంది. కొత్తగా 12,514 మంది​ (Covid cases in India) వైరస్​ బారిన పడ్డారు. మరో 251 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా 12,718 మంది కరోనాను జయించారు. కాగా.. ఒక్క కేరళ రాష్ట్రంలోనే 7,167 కేసులు.. 167 మరణాలు నమోదయ్యాయి.

  • మొత్తం కేసులు: 3,42,85,814‬
  • మొత్తం మరణాలు: 4,58,437
  • యాక్టివ్​ కేసులు: 1,58,817
  • మొత్తం కోలుకున్నవారు: 3,36,68,560

వ్యాక్సినేషన్​..

భారత్​లో టీకా పంపిణీ (Vaccination in India) జోరుగా కొనసాగుతోంది. ఆదివారం మరో 12,77,542 డోసుల వ్యాక్సిన్​ అందించగా.. మొత్తం ఇప్పటివరకు 1,06,31,24,205 డోసుల టీకా పంపిణీ జరిగింది.

ప్రపంచవ్యాప్తంగా..

ప్రపంచవ్యాప్తంగా రోజువారి కరోనా కేసుల్లో (coronavirus worldwide) తగ్గుదల నమోదైంది. కొత్తగా 3,27,243 మందికి కొవిడ్​ (Corona update) పాజిటివ్​గా తేలింది. వైరస్​ ధాటికి 4,595 మంది మరణించారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 24,74,63,395కు చేరింది. మొత్తం మరణాల సంఖ్య 50,14,976కు పెరిగింది.

వివిధ దేశాల్లో కొత్త కేసులు..

  • అమెరికాలో కరోనా కేసులు భారీగా తగ్గాయి. కొత్తగా 19,975 మందికి వైరస్​ సోకగా.. మరో 162 మంది ప్రాణాలు కోల్పోయారు.
  • రష్యాలో కొత్తగా 40,993 మందికి వైరస్​ సోకింది. ఒక్కరోజే 1,158 మంది చనిపోయారు.
  • బ్రిటన్​లో కొత్తగా 38,009 మందికి వైరస్​ పాజిటివ్​గా తేలింది. 74 మంది మృతి చెందారు.
  • టర్కీలో కొత్తగా 23,948 మంది వైరస్​ బారిన పడగా.. 201 మంది మరణించారు.
  • జర్మనీలో కొత్తగా మరో 13,912 మందికి కొవిడ్ సోకింది. 25 మంది చనిపోయారు.

ఇదీ చూడండి:Corona Cases: కేరళలో మరో 7వేల మందికి కరోనా

ABOUT THE AUTHOR

...view details