జమ్ముకశ్మీర్ ప్రభుత్వం చేపట్టిన డోర్ టు డోర్ వ్యాక్సినేషన్ ప్రక్రియలో భాగంగా.. 124ఏళ్ల బామ్మ గురువారం టీకా తీసుకున్నారు. బారముల్లాకు చెందిన ఈ బామ్మ టీకా తొలి డోసు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.
"124 ఏళ్ల బామ్మ రెహ్తీ బేగమ్ టీకా తొలి డోసు తీసుకున్నారు. డోర్ టు డోర్ టీకా పంపిణీ కార్యక్రమంలో భాగంగా.. క్రాల్ మొహల్లా ప్రాంతంలో ఆమె వ్యాక్సిన్ వేసుకున్నారు," అని ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్స్ డిపార్ట్మెంట్ ట్వీట్ చేసింది.