తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఠాణెలో 12,000 జిలెటిన్ స్టిక్స్- 3,000 డిటోనేటర్లు - ఠాణే పోలీసులు పేలుడు పదార్థాలు

కార్వాలీ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి నుంచి ఠాణె పోలీసులు 12,000 జిలెటిన్​ స్టిక్స్​, 3,000కు పైగా డిటోనేటర్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అరెస్టు చేశారు.

thane crime branch, ఠాణేలో పేలుడు పదార్థాలు
పేలుడు పదార్థాలు

By

Published : May 19, 2021, 8:24 AM IST

మహారాష్ట్రలోని ఠాణె జిల్లా పరిధిలోని ఓ గోదాములో పోలీసులు భారీ మొత్తంలో పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు గురునాథ్​ మహత్రేకు చెందిన ఆ గోదాములో 12,000 జిలెటిన్​ స్టిక్స్​, 3,000లకు పైగా డిటోనేటర్లు లభ్యమయ్యాయి. నిందితుడు మహత్రేను పోలీసులు అరెస్టు చేశారు.

ఠాణేలో భారీ మొత్తంలో పేలుడు పదార్థాల పట్టివేత
ఠాణేలో భారీ మొత్తంలో పేలుడు పదార్థాల పట్టివేత

నిందితుడు అక్రమంగా పేలుడు పదార్థాలను గోదాములో నిల్వ ఉంచాడని పోలీసులకు సమాచారం అందింది. ఈ మేరకు ఠాణె క్రైం బ్రాంచ్​ అధికారులు భివండీ పట్టణ సమీపంలోని కార్వాలీ గ్రామానికి చెందిన నిందితుడి గోదాముపై మంగళవారం దాడులు జరిపారు. నిందితుడు నిర్మాణ, మైనింగ్​ వ్యాపారాలు చేస్తుండటం చేత ఈ పేలుడు పదార్థాలను నిల్వ చేసి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. అయితే అతను ఎలాంటి భద్రతా ప్రమాణాలు పాటించని కారణంగా అరెస్టు చేసినట్లు వెల్లడించారు. ఈనెల 22 వరకు నిందితుడు పోలీస్​ కస్టడీలో ఉంటాడని సమాచారం.

ఇదీ చదవండి :'రాష్ట్రాలు, యూటీల వద్ద 1.94 కోట్ల టీకాలు'

ABOUT THE AUTHOR

...view details