Minor Girl Birth to Child: 12 ఏళ్ల బాలిక.. ఓ శిశువుకు జన్మనిచ్చిన ఘటన హరియాణాలోని కర్నాల్‌లో జరిగింది. ఈ విషయం తెలుసుకొని షాకైన పోలీసులు.. ఎఫ్ఐఆర్ నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
బాలికపై అత్యాచారం జరిగిందనే అనుమానం వ్యక్తమవుతోంది. అవమానంతో పరువు పోతుందనే పోలీసులకు ఫిర్యాదు చేయలేదని తెలుస్తోంది. ఆ భయంతోనే బిహార్‌కు చెందిన బాధిత కుటుంబం.. కర్నాల్‌కు వచ్చినట్లుగా స్థానికులు చెబుతున్నారు.
కర్నాల్‌లోని మురికివాడలో కుటుంబంతో కలిసి నివసిస్తోంది బాధితురాలు. మురికివాడ ప్రజలకు ఆవాసం కల్పించేందుకు ఆ ప్రాంతంలో పర్యటిస్తున్న అధికారులు.. 12 ఏళ్ల బాలిక గర్భం దాల్చడం గురించి తెలుసుకుని చైల్డ్ వెల్ఫేర్ కమిషన్‌కు సమాచారం అందించారు. వారు.. బాధితురాలిని కల్పనా చావ్లా ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించగా.. బుధవారం పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. అయితే.. పోలీసుల జోక్యంతో భయపడిన బాధిత కుటుంబం మళ్లీ బిహార్‌కు వెళ్లిందని సమాచారం.
Grandparents Killed: ఉత్తర్‌ప్రదేశ్ బదాయూలో దారుణ ఘటన జరిగింది. మద్యం కోసం డబ్బులు ఇవ్వలేదని సొంత అవ్వ, తాతను హత్య చేశాడు 20 ఏళ్ల యువకుడు. అనంతరం.. వారి మృతదేహాలను రెండు వేర్వేరు గదుల్లో ఉంచి తాళం వేసి పారిపోయాడు. జూన్ 22న హత్య చేసి ఉండొచ్చని పోలీసులు తెలిపారు. నిందితుడి కోసం గాలిస్తున్నారు.
ఇదీ జరిగింది:హిమేశ్ తన అవ్వ భావన్ దేవీ(60), తాత ప్రేమ్ శంకర్‌తో (65) కలిసి దిల్లీలో నివాసముంటున్నాడు. వీరంతా.. తమ స్వస్థలం ఉత్తర్‌ప్రదేశ్‌లోని దామ్రీ గ్రామానికి జూన్ 22న ఓ పెళ్లికి హాజరయ్యేందుకు వచ్చారు. మద్యానికి బానిసైన హిమేశ్ డబ్బులు ఇవ్వలేదని.. వారితో గొడవపడి హత్య చేశాడు.