తెలంగాణ

telangana

ETV Bharat / bharat

12 ఏళ్ల బాలికకు బలవంతంగా రెండు పెళ్లిళ్లు.. గర్భం దాల్చాక! - ఉత్తరాఖండ్ పితోర్​గఢ్​

12 year old girl pregnant: 12 ఏళ్ల బాలికకు బలవంతంగా రెండు వివాహాలు చేసిన ఘటన ఉత్తరాఖండ్​లో జరిగింది. తాజాగా మైనర్ గర్భం దాల్చడం వల్ల ఈ దారుణం బయటపడింది. బాధితురాలికి బలవంతంగా పెళ్లిళ్లు చేసిన ఆమె తల్లి, బాధితురాలి రెండో భర్తను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

berinag minor girl
మైనర్

By

Published : Jun 22, 2022, 2:01 PM IST

12 year old girl pregnant: తల్లి, సవతి తండ్రి కలిసి 12 ఏళ్ల బాలిక​కు బలవంతంగా రెండు వివాహాలు చేసిన ఘటన బయటపడింది. తాజాగా మైనర్​ గర్భం దాల్చడం వల్ల ఈ విషయం వెలుగులోకి వచ్చింది. నిందితులపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. బాధితురాలి రెండో భర్త, ఆమె తల్లిని పోలీసులు అరెస్టు చేశారు. మైనర్.. మొదటి భర్తను త్వరలో అరెస్టు చేస్తామని పోలీసులు తెలిపారు. ఈ ఘటన ఉత్తరాఖండ్​, పిథౌరాగౌఢ్​లోని బేరీనాగ్​లో జరిగింది.

అసలేం జరిగిందంటే: మైనర్​ బాలిక పిథౌరాగఢ్ సమీపంలోని ధార్చూలా గ్రామానికి చెందినది. అదే గ్రామానికి చెందిన వ్యక్తితో గతేడాది జూన్​లో మైనర్​కు ఆమె తల్లి, సవతి తండ్రి కలిసి మొదటి వివాహం చేశారు. కొన్ని రోజులు తర్వాత తన భర్త కొడుతున్నాడని బాలిక.. తన తల్లి ఇంటికి వచ్చేసింది. మరో ఆరు నెలల తర్వాత గతేడాది డిసెంబరులో 36 ఏళ్ల వ్యక్తితో రెండో పెళ్లి చేశారు. అప్పటినుంచి బాధితురాలు రెండో భర్తతో కలిసి ఉంటోంది. తాజాగా మైనర్ గర్భం దాల్చడం వల్ల ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై పోలీసులు ఇరు కుటుంబాలకు కౌన్సిలింగ్ ఇవ్వగా.. తప్పును అంగీకరించాయి. తమకు చట్టంపై అవగాహన లేదని చెప్పారు కుటుంబసభ్యులు. బాలికకు అర్హత వయస్సు వచ్చిన తర్వాతే వివాహం చేస్తామని పోలీసులకు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details