తెలంగాణ

telangana

ETV Bharat / bharat

12 ఏళ్ల బాలికపై అత్యాచారం- చెట్టుకు వేలాడదీసి.. - మధ్యప్రదేశ్​ క్రైం వార్తలు

మధ్యప్రదేశ్​లో విదిశా జిల్లాలో ఓ 12 ఏళ్ల బాలిక హత్యాచారానికి గురైంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నలుగురు అనుమానితుల్ని అదుపులోకి తీసుకున్నారు.

12 year old raped in jungle,
12 ఏళ్ల బాలికపై అత్యాచారం..ఆపై చెట్టుకు వేలాడదీసి..

By

Published : Aug 4, 2021, 6:55 PM IST

మధ్యప్రదేశ్​లోని విదిశా జిల్లాలో అమానుష ఘటన జరిగింది. 12 ఏళ్ల బాలికపై ఓ కిరాతకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆపై ఆమెను హత్యను చేసి.. బాలిక శవాన్ని ఓ చెట్టుకు వేలాడదీశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. నలుగురు అనుమానితుల్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

ఇదీ జరిగింది..

బుధవారం ఉదయం 11 గంటలకు సమీపాన ఉన్న అడవి నుంచి పండ్లు, కూరగాయలు తెచ్చుకుందామని బాలిక తల్లి, ఆమె అక్క బయలుదేరారు. వారి వెంటే బాలిక కూడా వెళ్లింది. తర్వాత కాసేపటికి ఆమె కనిపించకుండాపోయింది. బాలిక అప్పటికే ఇంటికి చేరుకుని ఉంటుందని భావించిన తల్లి.. తన పెద్ద కుమార్తెతో సాయంత్రం 4 గంటలకు ఇంటికి వచ్చింది. కానీ ఇంటి వద్ద కుమార్తె కనిపించకపోయేసరికి ఆందోళన చెందిన తల్లిదండ్రులు బాలిక కోసం గాలించసాగారు. ఈ క్రమంలో అడవిలో ఓ చెట్టుకు తమ కుమార్తె శవం వేలాడి ఉండటం చూసి కంగుతిన్నారు.

బాలికపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడు.. చున్నీతో ఆమె మెడకు ఉరివేసి అక్కడున్న చెట్టుకు వేలాడదీశాడని పోలీసులు భావిస్తున్నారు. పోస్ట్​మార్టం రిపోర్ట్​ వచ్చాక పూర్తి వివరాలు వెల్లడిస్తామని తెలిపారు. ఈ ఘటన కేసు నమోదు చేశామని.. నిందితులుగా భావిస్తున్న నలుగురిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు.

ఇదీ చదవండి :దళిత బాలికపై హత్యాచారం- రాజకీయంగా దుమారం

ABOUT THE AUTHOR

...view details