Girl pregnant before marriage:ఓ 12 ఏళ్ల బాలిక పొరుగింటి యువకుడిని ప్రేమించి.. సన్నిహితంగా మెలిగింది. దీంతో గర్భం దాల్చింది. గుట్టుచప్పుడు కాకుండా వారికి వివాహం జరిపించారు కుటుంబ సభ్యులు. సమాచారం అందుకున్న పోలీసులు మండపానికి చేరుకుని అత్యాచారం నేరం కింద వరుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటన మహారాష్ట్రలోని నాగ్‌పుర్‌లో జరిగింది.
ఇదీ జరిగింది:నాగ్‌పుర్, ఎంఐడీసీ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ కాలనీలో 12 ఏళ్ల బాలిక నివాసం ఉంటోంది. ఆమెకు తల్లి లేదు. తండ్రి కూలి పనులు చేసుకుంటూ పోషిస్తున్నాడు. పని ధ్యాసలో పడి కుమార్తె ఏం చేస్తుందని గమనించలేకపోయాడు. ఈ క్రమంలోనే పొరుగింటిలో ఉండే యువకుడి(22)తో ప్రేమలో పడి గర్భం దాల్చింది బాలిక. ఇది తెలుసుకున్న బాలిక తండ్రి.. సమాజంలో తమ పరువు పోతుందని భయపడ్డాడు. ఈ విషయం బయటకు రాకుండా జాగ్రత్త పడ్డాడు. పోలీసులకు ఫిర్యాదు చేయటానికి బదులుగా యువకుడి కుటుంబ సభ్యులను ఒప్పించి ఇరువురికి గుట్టు చప్పుడు కాకుండా వివాహం చేశారు. తమ బిడ్డను పెళ్లి చేసుకుంటే కొత్త ఇల్లు కట్నంగా ఇస్తామని హామీ ఇచ్చాడు ఆ తండ్రి.