రోబో తయారు చేసిన హర్సిర్జన్ 12 year old boy builds robot: పంజాబ్‌లోని లూథియానాకు చెందిన 12 ఏళ్ల హర్సిర్జన్... అద్భుతాలు చేస్తున్నాడు. ఏడో తరగతి చదువుతున్న హర్సిర్జన్.. చిన్నప్పట్నుంచే రోబోటిక్స్‌పై ఆసక్తి పెంచుకున్నాజు. రోబోటిక్స్ టెక్నాలజీలో శిక్షణ పొందుతున్న ఈ బాలుడు... పాఠశాలలో ఇచ్చిన ప్రాజెక్టులో భాగంగా ఆల్ట్రా వైలెట్ డిస్‌ఇన్‌ఫెక్షన్ రోబో తయారు చేసి ప్రశంసలు అందుకుంటున్నాడు.
UV disinfection robot
ఆల్ట్రా వైలెట్ డిస్‌ఇన్‌ఫెక్షన్ రోబో.. బ్యాక్టీరియాను చంపుతుందని హర్సిర్జన్ చెబుతున్నాడు. దీనికి యూవీ-21 అని నామకరణం చేసినట్లు చెప్పాడు. ఈ రోబో 360డిగ్రీల కోణంలో పనిచేసే కెమెరా కలిగి ఉంది. మెుబైల్ వై-ఫై సాయంతో దీన్ని నియంత్రించవచ్చు. ఈ రోబో విడుదల చేసే అతినీలలోహిత కిరణాల వల్ల బ్యాక్టీరియా చనిపోతుందని హర్సిర్జన్ వివరించాడు. కరోనా విజృంభణ నేపథ్యంలో ఈ రోబో తయారు చేసినట్లు పేర్కొన్న హర్సిర్జన్... అందుకు 15వేలు ఖర్చయినట్లు చెప్పాడు. బ్యాటరీల ఆధారంగా పనిచేసే యూవీ-21 రోబో.. ఆస్పత్రులు, ఇళ్లలో ఉపయోగపడుతుంది. ఈ రోబోను ఎక్కడికైనా తీసుకెళ్లవచ్చని 1.5 మీటర్ల చుట్టు వరకు ప్రభావం చూపుతుందని హర్సిర్జన్ తెలిపాడు.
మెడల్స్, సర్టిఫికేట్స్‌తో బాలుడు హర్సిర్జన్ తయారుచేసిన రోబోకు ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటుదక్కింది. గతేడాది డిసెంబరులో ఈ ప్రాజెక్టు చేపట్టిన హర్సిర్జన్... కేవలం రెండు నెలల్లో పూర్తిచేశాడు. పేటెంట్ హక్కులు పొందేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపాడు. పూర్తిస్థాయిలో పరీక్షించి మరిన్ని సవరణలు చేశాక... తక్కువధరకే మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు హర్సిర్జన్ చెప్పాడు. ఏదైనా కంపెనీ తనను సంప్రదిస్తే మరిన్ని రకాలు తయారు చేస్తానన్నాడు. తమ కుమారుడి నూతన ఆవిష్కరణపై... హర్సిర్జన్ తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి:నిన్న ఆటో డ్రైవర్.. నేడు కార్పొరేషన్ మేయర్