తెలంగాణ

telangana

By

Published : May 23, 2021, 7:00 PM IST

Updated : May 23, 2021, 7:28 PM IST

ETV Bharat / bharat

మే 26 నిరసనలకు విపక్షాల మద్దతు

మే 26న బ్లాక్​ డే పేరిట సంయుక్త కిసాన్ మోర్చా తలపెట్టిన నిరసనలకు విపక్షాలు మద్దతు ప్రకటించాయి. సాగు చట్టాలకు వ్యతిరేకంగా దిల్లీ సరిహద్దుల్లో రైతులు చేస్తున్న ఉద్యమానికి 6 నెలలు పూర్తికానున్న సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తోంది ఎస్​కేఎం.

12 opposition parties extend support to SKM protest cal on May 26
మే 26 బ్లాక్​ డేకు మద్దతు ప్రకటించిన ప్రతిపక్షాలు

మే 26న సంయుక్త కిసాన్ మోర్చా తలపెట్టిన దేశవ్యాప్త నిరసనలకు 12 విపక్ష పార్టీలు మద్దతు ప్రకటించాయి.

సాగు చట్టాలకు వ్యతిరేకంగా చేపట్టిన రైతు ఉద్యమం 6 నెలలు పూర్తి కావొస్తున్న సందర్భంగా మే 26న 'బ్లాక్ డే' పాటించాలని సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్‌కేఎం) ఇటీవల పిలుపునిచ్చింది. కాంగ్రెస్, జేడీఎస్, ఎన్​సీపీ, టీఎంసీ, శివసేన, డీఎంకే, ఎస్​పీ, వామపక్షాలు సహా ఇతర ప్రధాన పార్టీలు ఇందుకు మద్దతు తెలిపాయి.

ప్రభుత్వం రైతులను వెంటనే చర్చలకు ఆహ్వానించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల ప్రకారం.. కనీస మద్దతు ధర(ఎంఎస్పీ)కి చట్టబద్ధత కల్పించాలని ఉమ్మడి ప్రకటనలో పేర్కొన్నాయి.

ఇవీ చదవండి:'మా సహనాన్ని పరీక్షించొద్దు.. చర్చలు జరపండి'

మే 26న బ్లాక్ డే- 'ఇంటి నుంచే నిరసన'కు పిలుపు

Last Updated : May 23, 2021, 7:28 PM IST

ABOUT THE AUTHOR

...view details