తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'ముత్తూట్'​లో దొంగల బీభత్సం- 12 కిలోల బంగారం చోరీ - ఆసన్​సోల్​ ముత్తూట్​ ఫైనాన్స్​ సంస్థలో దోపిడీ

ముత్తూట్​ ఫైనాన్స్​(Robbery in Muthoot Finance) కార్యాలయంలోకి గుర్తు తెలియని వ్యక్తులు.. తుపాకీలతో దూసుకువచ్చారు. ఉద్యోగులను బెదిరించి, 12 కిలోల బంగారం, రూ.3 లక్షల నగదు ఎత్తుకెళ్లారు.

Robbery in Muthoot Finance
ముత్తూట్​ ఫైనాన్స్​లో దోపిడీ

By

Published : Sep 12, 2021, 11:24 AM IST

Updated : Sep 12, 2021, 11:37 AM IST

'ముత్తూట్'​లో దొంగల బీభత్సం

బంగాల్​ ఆసన్​సోల్​లో(West Bengal Asansol news) దొంగలు రెచ్చిపోయారు. ముత్తూట్ ఫైనాన్స్​ సంస్థ కార్యాలయంలోకి​(Robbery in Muthoot Finance) తుపాకులతో దూసుకువచ్చి, అందినకాడికి దోచుకుని ఉడాయించారు.

అసలేమైంది?

ఆసన్​సోల్​లోని​ ముత్తూట్​ ఫైనాన్స్​ కార్యాలయంలోకి​(Robbery in Muthoot Finance) వచ్చిన నలుగురు గుర్తు తెలియని వ్యక్తులు.. ఉద్యోగులను తుపాకీలతో బెదిరించారు. అనంతరం లాకర్​లో నుంచి బంగారం, నగదు ఎత్తుకెళ్లారని పోలీసులు చెప్పారు. శనివారం ఉదయం ఈ ఘటన జరిగిందిని పేర్కొన్నారు.

ఉద్యోగులను తుపాకీతో బెదిరిస్తున్న దుండగుడు(సీసీటీవీ దృశ్యం)
పోలీసులకు వివరాలు వెల్లడిస్తున్న సంస్థ ఉద్యోగులు
దుండగుల దాడిలో గాయపడ్డ సెక్యూరిటీ గార్డు

"ఓ వ్యక్తి కార్యాలయంలోకి దూసుకువచ్చి, మాపై తుపాకీ గురిపెట్టాడు. ఆ వెంటనే మరో ముగ్గురు దుండగులు వచ్చి, సెక్యూరిటీ గార్డును కొట్టారు. వాళ్లు 12 కిలోల బంగారం, రూ.3 లక్షల నగదు ఎత్తుకెళ్లారు." అని సంస్థలో పని చేసే ఉద్యోగి సోనాలీ తెలిపారు.

ఇదీ చూడండి:సొంతిల్లు, సొంత వాహనం లేని ముఖ్యమంత్రి

Last Updated : Sep 12, 2021, 11:37 AM IST

ABOUT THE AUTHOR

...view details