తెలంగాణ

telangana

ETV Bharat / bharat

తమిళనాడులో రూ.12 కోట్ల బంగారం స్వాధీనం - బంగారం అక్రమ రవాణా

తిరునేల్​వేలిలో అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని ఎన్నికల అధికారులు సీజ్​ చేశారు. దీని విలువ రూ.12 కోట్లు ఉంటుందని తెలిపారు. కన్యాకుమారికి చెందిన ఓ వ్యాపారి వీటిని కొనుగోలు చేసినట్లు సమాచారం.

gold seized from tirunelveli, 12 కోట్లు విలువ చేసే బంగారం స్వాధీనం
తమిళనాడులో రూ.12 కోట్ల బంగారం స్వాధీనం

By

Published : Mar 29, 2021, 7:49 PM IST

తమిళనాడులోని తిరునేల్​వేలిలో ఓ వాహనం నుంచి ఎన్నికల అధికారులు రూ.12 కోట్లు విలువ చేసే బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. సోమవారం మధురై విమానాశ్రయం నుంచి కన్యాకుమారి తరలిస్తుండగా అధికారులు జరిపిన తనిఖీలో ఇది పట్టుబడింది. బంగారానికి సంబంధించి సరైన పత్రాలు లేనందున అధికారులు సీజ్ చేశారు . కన్యాకుమారికి చెందిన ఓ వ్యాపారి వీటిని కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఎక్కువ మొత్తంలో నగలను కొనుగోలు చేసి ఇతర వ్యాపారులకు విక్రయిస్తాడని సమాచారం.

స్వాధీనం చేసుకున్న బంగారం
స్వాధీనం చేసుకున్న బంగారం

కోటి రూపాయలు స్వాధీనం..

తిరుచ్చి జిల్లా మనప్పారై నియోజవర్గం అన్నాడీఎంకే అభ్యర్థి చంద్రశేఖర్ సిబ్బంది ఇళ్లపై ఆదాయపన్ను శాఖ సోమవారం దాడులు జరిపింది. చంద్రశేఖర్​ డబ్బులు పంచుతున్నారన్న సమాచారం మేరకు ఆయన దగ్గర డ్రైవర్లుగా పనిచేస్తున్న అళగర్​సామి, తంగపాండియన్, ఆనంద్​ ఇళ్లలో సోదాలు నిర్వహించింది. ఈ క్రమంలో అళగర్​సామి ఇంట్లో ఈ భారీ మొత్తం పట్టుబడింది. ఆ ప్రాంతంలోని ఇతర రాజకీయ ప్రముఖుల ఇళ్లలో కూడా ఐటీ శాఖ సోదాలు చేసింది.

ఇదీ చదవండి :'ఒక వ్యక్తి ఒకేసారి ఓటు వేసేలా చూడండి'

ABOUT THE AUTHOR

...view details