తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఇంటర్​ బాలిక ప్రసవం.. శిశువు మృతి.. పదో తరగతి విద్యార్థే..! - తమిళనాడులో దారుణం శౌచాలయం వద్ద మృత శిశువు

ఓ పాఠశాల శౌచాలయం వద్ద మృత శిశువు దొరికింది. దాన్ని చూసిన కొందరు విద్యార్థులు ఉపాద్యాయులకు తెలియజేశారు. వారు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృత శిశువును స్వాధీనం చేసుకున్నారు. ఈ అమానవీయ ఘటన ఎక్కడ జరిగిందంటే..

dead child found near toilet in school
11th Grade Girl gave birth to child - Reason for it was 10th Grade Boy

By

Published : Sep 6, 2022, 6:46 PM IST

తమిళనాడులో అమానవీయ ఘటన జరిగింది. కడలూరులోని ఓ పాఠశాల శౌచాలయం వద్ద మృత శిశువు దొరికింది. దాన్ని చూసిన విద్యార్థులు ఉపాధ్యాయులకు సమాచారం అందించారు. వారు పోలీసులకు విషయం తెలియజేశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పాఠశాల రోజులాగే ప్రారంభమైంది. అందులో 500 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. శౌచాలయం వైపు వెళ్లిన కొందరు విద్యార్థులకు పొదల్లో పడి ఉన్న శిశువును కనిపించింది. వెంటనే ఉపాధ్యాయులకు, హెడ్​ మాస్టర్​కు తెలియజేశారు. హెడ్​ మాస్ట్​ర్​ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని శిశువు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. విచారణ అనంతరం 11వ తరగతికి చెందిన బాలిక ఈ శిశువుకు జన్మనిచ్చిందని నిర్ధరించారు.

ఇదీ జరిగింది..పాఠశాలకు చెందిన 11వ తరగతి బాలిక.. పదో తరగతికి చెందిన విద్యార్థితో ప్రేమలో ఉంది. అతడి కారణంగా గర్భం దాల్చింది. శుక్రవారం ఉదయం ఎప్పటిలాగే పాఠశాల ప్రారంభమైంది. బాలిక పాఠశాలకు వచ్చే క్రమంలో.. శౌచాలయం వద్ద శిశువుకు జన్మనిచ్చింది. భయంతో శిశువును అక్కడున్న పొదల్లో పడేసింది. అనంతరం అక్కడి నుంచి పారిపోయింది.
వైద్య పరీక్షల నిమిత్తం బాలికను ఆస్పత్రికి తరలించారు. బాలిక తరఫున తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని, అందుకే ఘటనకు సంబంధించి ఎలాంటి కేసు నమోదు చేయలేదని పోలీసులు పేర్కొన్నారు. దీనికి కారణమైన వారు ఇద్దరు మైనర్లు కావడం వల్ల.. పోలీసులు ఇప్పటిదాకా కేసు నమోదు చేయలేదని తెలుస్తోంది.

ABOUT THE AUTHOR

...view details