తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కేరళలో మరో ముగ్గురికి జికా వైరస్​ - కేరళలో జికా కేసులు

కేరళలో మరో 11,586 మందికి కరోనా పాజిటివ్​గా తేలింది. కొత్తగా 135 మంది మృతి చెందారు. మరోవైపు తాజాగా ముగ్గురు జికా వైరస్​ బారిన పడినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ తెలిపింది.

covid cases in kerala, Zika cases
కేరళలో జికా కేసులు, కరోనా కేసులు

By

Published : Jul 26, 2021, 8:51 PM IST

కేరళలో రోజువారీ కరోనా కేసుల సంఖ్యలో తగ్గుదల నమోదైంది. అయితే మరణాల సంఖ్య పెరిగింది. తాజాగా 11,586 మందికి వైరస్​ సోకింది. ఫలితంగా మొత్తం కొవిడ్​ బాధితుల సంఖ్య 32 లక్షల 83 వేలు దాటింది. మరో 135 మంది మరణించగా.. మొత్తం మృతుల సంఖ్య 16,170కు చేరింది. కాగా కొత్తగా 14,912 మంది కోలుకున్నట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య మంత్రి వీనా జార్జ్​ తెలిపారు.

51కు చేరిన జికా

రాష్ట్రంలో మరోవైపు జికా వైరస్​ బాధితుల సంఖ్య నెమ్మదిగా పెరుగుతోంది. కొత్తగా మరో ముగ్గురుకి వైరస్​ సోకినట్లు అధికారులు వెల్లడించారు.

ఇదీ చూడండి:ఏడు గంటల పాటు బస్సుపైనే మేనేజర్​- ఎందుకంటే..

ABOUT THE AUTHOR

...view details