110 Years of Indian Cinema Festival at Ramoji Film City : ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన రామోజీ ఫిల్మ్‌సిటీ(Ramoji Film City)లో.. 110 ఏళ్ల ఇండియన్ సినిమా ఉత్సవాలు(110 Years Indian Cinema Festival) ఘనంగా ప్రారంభమయ్యాయి. సినిమాటిక్ ఎంటర్‌టైన్‌మెంట్, కార్నివాల్ పరేడ్‌తో సంబురాలు అంబురాన్నంటుతున్నాయి. ఈనెల12 నుంచి ప్రారంభమైన ఈ అపూర్వ వేడుకలు 46 రోజుల పాటు(Carnival Fest in Ramoji Film City) జరగనున్నాయి. సరికొత్త అందాలతో రామోజీ ఫిల్మ్‌సిటీ పర్యాటకులకు స్వాగతం పలుకుతోంది.
National Film Day 2023 :భూతల స్వర్గంగా పేరొందిన రామోజీ ఫిల్మ్‌సిటీలో 110 ఏళ్ల ఇండియన్ సినిమా ఉత్సవాలు అంబరాన్ని తాకుతున్నాయి. రంగు రంగుల విద్యుత్ కాంతులు, వివిధ రకాల ఆటపాటలతో సందర్శకులను ఆకట్టుకునేందుకు రామోజీ ఫిల్మ్‌సిటీ నూతన హంగులను సంతరించుకుంది. పూటకో వినోదం, అడుగడుగునా ఆశ్చర్యం కలిగించేలా ఎన్నో రకాల ప్రదర్శనలు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తున్నాయి. ఫిల్మ్‌సిటీ సుందర మార్గాల్లో కార్నివాల్ పరేడ్ ప్రేక్షకులను మరో లోకానికి తీసుకెళ్తోంది.
110 Years of Indian Cinema Celebrations at Ramoji Film City : సినిమాటిక్ ఎంటర్‌టైన్‌మెంట్‌ను ఆస్వాదించేందుకు.. రెండు తెలుగు రాష్ర్టాలనుంచే కాకుండా మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, కేరళ, ఉత్తర భారతదేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు తరలివస్తున్నారు. పక్షుల ఉద్యానవనం, వాటర్ ఫాల్స్, జెయింట్ వీల్స్, ఎలక్ట్రిక్ రైలు ప్రయాణం, గుర్రపుస్వారీలు తమనెంతో ఆకట్టుకున్నాయని చిన్నారులు చెబుతున్నారు.
"రామోజీ ఫిల్మ్‌సిటీ చాలా బాగుంది. సినిమా షూటింగ్స్ ఎలా జరుగుతాయి. లొకేషన్లు ఎలా ఉంటాయి తెలుసుకున్నాం. ఉదయం నుంచి బాహుబలి సెట్, చంద్రముఖి భవనం వంటి చూపించారు. ఈ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. చాలా సినిమా సెట్లు చూశాం."- విద్యార్థులు