11 Year Old Boy Killed By Woman In Delhi : కొన్నేళ్లపాటు వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న వ్యక్తి.. తనను పెళ్లి చేసుకోలేదన్న కోపంతో అతడి కుమారుడిని హత్య చేసింది ఓ మహిళ. అతడి ఇంటికి వెళ్లి మరీ గొంతు నులిపి చంపేసింది. ఆ తర్వాత తప్పించుకుని తిరగ్గా.. దిల్లీ పోలీసులు ఇటీవలే అరెస్ట్ చేశారు. అసలేం జరిగిందంటే?
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..దిల్లీలోనిఇంద్రపురి ప్రాంతానికి చెందిన నిందితురాలు పూజా కుమారికి 2019లో జితేందర్ అనే వివాహితుడితో పరిచయం ఏర్పడింది. అది కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. భార్యకు విడాకులిచ్చి తనను పెళ్లి చేసుకుంటానని పూజను నమ్మించి ఆమెతో జితేంద్ర సహజీవనం కొనసాగించాడు. అయితే 2022లో పూజను విడిచిపెట్టి.. తన భార్యాకుమారుల దగ్గరకు వెళ్లిపోయాడు జితేంద్ర. దీంతో అతడిపై పూజ కోపం పెంచుకుంది. పగ తీర్చుకోవాలని నిర్ణయించుకుంది. జితేంద్ర.. తన కుమారుడు దివ్యాంశ్(11) కారణంగానే తనను వివాహం చేసుకోవడానికి నిరాకరించాడని పూజ భావించింది. అందుకే చిన్నారిని చంపేందుకు పథకం రచించింది.